NTV Telugu Site icon

Upendra Kushwaha: 2024లోనూ ప్రధాని మోడీకి ఎదురు లేదు.. నితీష్ ప్రయత్నం వృధానే!

Upendra Kushwaha

Upendra Kushwaha

వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కేంద్రంలోని బీజేపీ సర్కార్ ను గద్దె దింపాలని విపక్ష పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఇందుకోసం విపక్ష పార్టీలన్ని ఐక్యంగా పోరాడాలని భావిస్తున్నాయి. ఈ క్రమంలో బీహార్ సీఎం నితీష్ కుమార్ ముందడుగు వేశారు. ఇప్పటికే ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ సహా ఆమ్ ఆద్మీ పార్టీ, ఎన్సీపీ నేతలను కలిసి చర్చించారు. 2024 ఎన్నికల్లో మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించేందుకు ఉమ్మడిగా పోరాడాలని భావిస్తున్నారు. ఈ తరుణంలో వచ్చే ఎన్నికల్లోనూ మోడీకి ఎలాంటి ఢోకా లేదని బీహార్ సీఎం నితీష్ కుమార్ కు సన్నిహితుడిగా ఉన్న ఉపేంద్ర కుష్వాహా వ్యాఖ్యానించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Also Read:Karnataka elections: ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున బరిలోకి ఫిల్మ్ డైరెక్టర్!

జేడీ(యూ) పార్లమెంటరీ బోర్డు మాజీ చీఫ్ ఉపేంద్ర కుష్వాహా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీకి ఎలాంటి సవాల్‌ లేదని తేల్చి చెప్పారు. ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడిన కుష్వాహా.. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ విపక్ష ఐక్యత సాధించడానికి చేస్తున్న ప్రయత్నాలను అపహాస్యం చేశారు. రాష్ట్రంలో పొత్తు ఉన్న జెడి(యు) అత్యున్నత నాయకుడితో ఆ పార్టీలు మాత్రమే ఉన్నాయి.
Also Read:AHA: లాస్యప్రియ గాత్రానికి హరీశ్ రావు ఫిదా!

కొన్ని నెలల క్రితం జెడి(యు)తో తెగతెంపులు చేసుకుని రాష్ట్రీయ లోక్ జనతాదళ్‌ను ఏర్పాటు చేసిన కుష్వాహా, ఎన్‌డిఎలోకి చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే, ఈ విషయంపై తర్వలో ప్రకటన చేస్తానని కుష్వాహా తెలిపారు. కుష్వాహా గతంలో NDA మిత్రపక్షంగా ఉన్నారు. రాష్ట్రీయ లోక్ సమతా పార్టీకి నాయకత్వం వహిస్తున్నారు. నరేంద్ర మోడీ తొలి మంత్రివర్గంలో మంత్రి పదవిని దక్కించుకున్నారు. అయితే, 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు బిజెపి నేతృత్వంలోని సంకీర్ణాన్ని విడిచిపెట్టి, ఆర్‌జెడి, కాంగ్రెస్, కొన్ని ఇతర చిన్న పార్టీలతో ఏర్పాడిన ‘మహాఘట్ బంధన్’ తో కూటమిలో ఉన్నారు.