వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కేంద్రంలోని బీజేపీ సర్కార్ ను గద్దె దింపాలని విపక్ష పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఇందుకోసం విపక్ష పార్టీలన్ని ఐక్యంగా పోరాడాలని భావిస్తున్నాయి. ఈ క్రమంలో బీహార్ సీఎం నితీష్ కుమార్ ముందడుగు వేశారు. ఇప్పటికే ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ సహా ఆమ్ ఆద్మీ పార్టీ, ఎన్సీపీ నేతలు కలిసి చర్చించారు.