బీహార్ రాజకీయాలతో పాటు.. జాతీయ రాజకీయాల్లోనూ నితీష్ కుమార్ కీలక భూమిక పోషించారు.. గతంలో కేంద్ర మంత్రిగా కూడా పనిచేసిన ఆయన.. రెండు దఫాలుగా బీహార్ సీఎంగా కొనసాగుతున్నారు.. అయితే, ప్రధానికి కావాల్సిన అర్హతలన్నీ నితీష్ కుమార్‌కు ఉన్నాయంటూ.. జేడీయూ పార్లమెంటరీ పార్టీ నేత ఉపేంద్ర కుశ్వాహా వ్యాఖ్యానించడం కొత్త చర్చకు దారితీసింది.. దీంతో.. ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్న జేడీయూ నేత నితీష్ కుమార్ కూడా ప్రధాని రేసులో ఉన్నారా? అనే చర్చ మొదలైంది.. ఈ నేపథ్యంలో క్లారిటీ ఇచ్చింది జేడీయూ.. ప్రధాని కావడానికి బీహార్ సీఎం నితీశ్‌కుమార్‌కు అన్ని లక్షణాలు ఉన్నాయని, కానీ, ఆయన ప్రధాని పదవి రేస్‌లో లేరని స్పష్టం చేసింది.. ఇక, ఇదంతా నాన్సెన్స్ అని.. నేనెప్పుడు ఇది కోరుకోలేదు.. ఆశించలేదు అని.. మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు బదులిచ్చారు నితీష్ కుమార్.
ప్రధాని రేసులో నితీష్‌కుమార్..? క్లారిటీ ఇచ్చిన జేడీయూ
Show comments