NTV Telugu Site icon

బిగ్‌ బ్రేకింగ్‌ : ఏపీలో నైట్‌ కర్ఫ్యూ..

థర్డ్ వేవ్ ముప్పు నేపథ్యంలో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ నేపథ్యంలో పలు ఆంక్షలు విధింపుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కోవిడ్‌ నివారణా చర్యలను సమర్థవంతంగా అమలు చేయాలని సీఎం సూచించారు. భౌతిక దూరం పాటించేలా, మాస్క్‌లు కచ్చితంగా ధరించేలా చూడాలని, మాస్క్‌లు ధరించకపోతే జరిమానాను కొనసాగించాలన్నారు. దుకాణాల్లో, వ్యాపార సముదాయాల్లో కోవిడ్‌ ఆంక్షలు పాటించేలా చూడాలని జగన్‌ అన్నారు.

బస్సు ప్రయాణికులు కూడా మాస్క్‌ ధరించేలా చూడాలని, బహిరంగ ప్రదేశాల్లో 200 మంది, ఇన్‌డోర్స్‌లో 100 మంది మించకుండా చూడాలని సీఎం ఆదేశించారు. థియేటర్లలో 50 శాతం ఆక్యుపెన్సీ అంటే… సీటు మార్చి సీటుకు అనుమతించాలన్నారు. మాస్క్‌తప్పనిసరి చేయాలన్నారు. అంతేకాకుండా రాత్రి 11 గంటలనుంచి ఉదయం 5 గంటలవరకూ నైట్‌ కర్ఫ్యూ విధించాలన్నారు. దేవాలయాలు, ప్రార్థనా మందిరాల్లో కూడా భౌతిక దూరం పాటించాలని, మాస్క్‌ ధరించేలా చూడాలన్న సీఎం తెలిపారు. ఈ మేరకు మార్గదర్శకాలు విడుదలచేయనున్న వైద్య ఆరోగ్య శాఖకు సూచించారు.