కరోనా రక్కసి మరోసారి విజృంభిస్తోంది. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీ నమోదవుతున్నాయి. దీంతో ఇప్పటికే పలు రాష్ట్రాల్లో కోవిడ్ ఆంక్షలు తీవ్రతరం చేస్తూ.. నైట్ కర్ఫ్యూను విధించారు. మరికొన్ని రాష్ట్రాల్లో వీకెండ్ లాక్‌డౌన్ కూడా విధిస్తున్నారు. అయితే ఏపీలో కూడా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నైట్ కర్ఫ్యూను విధిస్తున్నట్లు ప్రకటించింది. నేటి నుంచి ఈ నెల 31 వరకు నైట్ కర్ఫ్యూ అమల్లో ఉంటుందని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ…
థర్డ్ వేవ్ ముప్పు నేపథ్యంలో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ నేపథ్యంలో పలు ఆంక్షలు విధింపుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కోవిడ్ నివారణా చర్యలను సమర్థవంతంగా అమలు చేయాలని సీఎం సూచించారు. భౌతిక దూరం పాటించేలా, మాస్క్‌లు కచ్చితంగా ధరించేలా చూడాలని, మాస్క్‌లు ధరించకపోతే జరిమానాను కొనసాగించాలన్నారు. దుకాణాల్లో, వ్యాపార సముదాయాల్లో కోవిడ్ ఆంక్షలు పాటించేలా చూడాలని జగన్ అన్నారు. బస్సు ప్రయాణికులు కూడా మాస్క్ ధరించేలా చూడాలని, బహిరంగ ప్రదేశాల్లో 200 మంది, ఇన్‌డోర్స్‌లో…