కరోనాపై ప్రధాని ప్రెస్‌మీట్.. శృంగారంపై ప్రశ్నతో షాక్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా మహమ్మారితో ప్రపంచదేశాలు మొత్తం అతలాకుతం అవుతుంటే.. న్యూజిలాండ్ మాత్రం కరోనాను చాలా సమర్థవంతంగా తిప్పికొట్టింది.. ఒక్క పాజిటివ్ కేసు నమోదు అయితే.. ఏకంగా వారం రోజుల పాటు లాక్డౌన్ పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి.. న్యూజిలాండ్‌లో కరోనా కట్టడికి ప్రధాని జసిండా ఆర్డెర్న్ తీసుకున్న నిర్ణయాలపై ప్రపంచ దేశాలు ప్రశంసల వర్షం కురిపించాయి.. అయితే, ఈ మధ్య మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆమెకు వింత ప్రశ్న ఎదురైంది.. దాంతో.. షాక్ తిన్న ఆమెకు ఓ దశలో చమటలు పట్టాయట.. ఆ ప్రశ్నకు ఆమె ఇచ్చిన హావభావాలు.. ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారాయి.
ఇక, అసలు విషయానికి వస్తే ఆరోగ్య శాఖ డైరెక్టర్ జనరల్ ఆష్లే బ్లూమ్ ఫీల్డ్ తో కలిసి ప్రధాని జసిండా ఆర్డెర్న్ మీడియాతో మాట్లాడుతుండగా.. అక్లాండ్‌లోని ఓ ఆస్పత్రిలో కోవిడ్ చికిత్స పొందుతున్న రోగిని చూసేందుకు వచ్చిన మహిళ.. అతడితో ఆస్పత్రిలోనే శృంగారంలో పాల్గొన్నట్టు వార్తలు వచ్చాయని.. అది ప్రమాదకరం కదా? అంటూ ప్రధానిని ప్రశ్నించారు ఓ మీడియా ప్రతినిధి.. దీంతో.. షాక్ తిన్న జసిండా.. ఆ వెంటనే తేరుకుని.. ధీటైన జవాబే ఇచ్చారు.. కోవిడ్ సమయంలోనే కాదు.. సాధారణ పరిస్థితుల్లో కూడా ఆస్పత్రుల్లో అలాంటి చర్యలు సరికాదని సమాధానం ఇచ్చారు.. అయితే, ఆ ప్రశ్న అడిగినప్పుడు ఆర్డెర్న్ ముఖం మారిపోయింది.. మొదట ఆశ్చర్యపోయిన ప్రధాని, తర్వాత నవ్వడం ప్రారంభించారు.. ఆమె రియాక్షన్ మాత్రం ఇప్పుడు వైరల్‌గా మారిపోయాయి.. మరోవైపు.. ఆ ప్రశ్నకు డాక్టర్ బ్లూమ్ ఫీల్డ్ చిరునవ్వుతో సమాధానం ఇచ్చారు. ఇది చాలా ప్రమాదకర చర్య అని నేను అనుకుంటున్నాను, కానీ, ఆ పరస్పర చర్య గురించి తమ దగ్గర ఎలాంటి వివరాలు లేవన్నారు.. కోవిడ్ పరిస్థితితో సంబంధం లేకుండా, అలాంటివి సాధారణంగా ఆస్పత్రులు జరగడం మంచిది కాదన్నారు. ఇక, కోవిడ్ వ్యాప్తిని అరికట్టడానికి లాక్డౌన్ ఉన్నప్పటికీ ఆక్లాండ్ ప్రాంతీయ ఆరోగ్య శాఖ రోజూ వందలాది మంది సందర్శకులను రోగులను చూసేందుకు అనుమతి ఇవ్వడం కూడా విమర్శలకు దారి తీసింది.
Also Read
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!