కాన్పూర్ టెస్టులో మూడో రోజు ఆటలో టీమిండియా పైచేయి సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్‌ను 296 పరుగులకు భారత్ ఆలౌట్ చేసింది. తద్వారా 49 పరుగుల కీలక ఆధిక్యం సంపాదించింది. 129/0 ఓవర్ నైట్ స్కోరుతో మూడో రోజు ఆట ప్రారంభించిన కివీస్‌ను భారత స్పిన్నర్లు కుదురుగా ఆడనివ్వలేదు. ముఖ్యంగా అక్షర్ పటేల్ బౌలింగ్ లో ఆడేందుకు కివీస్ బ్యాట్స్‌మెన్ ఇబ్బందులు పడ్డారు.
Read Also: ఐపీఎల్‌లో ఏ టీమ్ ఎవరిని రిటైన్ చేసుకోనుంది?
151 పరుగుల వద్ద తొలి వికెట్ భాగస్వామ్యాన్ని అశ్విన్ విడగొట్టాడు. ఆ తర్వాత విలియమ్సన్(18)ను ఉమేష్ యాదవ్ బుట్టలో వేసుకున్నాడు. అక్కడి నుంచి అక్షర్ పటేల్ మాయాజాలం మొదలైంది. లాథమ్ (95), విల్ యంగ్ (89) మినహా కివీస్ బ్యాట్స్‌మెన్‌లలో ఎవరూ పెద్దగా రాణించలేదు. చివర్లో జేమీసన్ (23) కాసేపు టీమిండియా బౌలర్లను విసిగించాడు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్‌కు 5 వికెట్లు పడగొట్టగా.. అశ్విన్ మూడు వికెట్లు సాధించాడు. జడేజా, ఉమేష్ యాదవ్ తలో వికెట్ తీశారు.
