ఐపీఎల్‌లో ఏ టీమ్ ఎవరిని రిటైన్ చేసుకోనుంది?

ఐపీఎల్‌లో ఒక్కో టీమ్ నలుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకునే అవకాశం ఉంది. అయితే వచ్చే ఏడాది రెండు కొత్త జట్లు ఐపీఎల్‌లోకి రంగప్రవేశం చేయనున్నాయి. ఈ నేపథ్యంలో ఏ టీమ్ ఏ ఆటగాడిని రిటైన్ చేసుకుంటుందో.. ఏ ఆటగాడు వేలంలోకి వస్తాడో అన్న విషయాలు ఆసక్తికరంగా మారాయి. అయితే క్రిక్ బజ్ వెబ్‌సైట్ ఇచ్చిన సమాచారం ప్రకారం ఏ టీమ్ ఎవరిని రిటైన్ చేసుకోబోతుందో తెలుస్తోంది.

Read Also: హార్దిక్ పాండ్యా ను ఆల్ రౌండర్ అని పిలవవచ్చా..?

ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు బుమ్రా, పొలార్డ్, ఇషాన్ కిషన్‌లను రిటైన్ చేసుకుందని తెలుస్తోంది. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ ధోనీ, ఆల్‌రౌండర్ జడేజా, ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్‌తో పాటు మొయిన్ అలీ లేదా సామ్ కరన్ లేదా డుప్లెసిస్‌లో ఒకరిని రిటైన్ చేసుకోనుందట. బెంగళూరు జట్టు విషయానికి వస్తే కోహ్లీ, దీపక్ పడిక్కల్, మ్యాక్స్‌వెల్‌తో పాటు చాహల్ లేదా సిరాజ్‌లలో ఒకరిని రిటైన్ చేసుకోబోతుందని సమాచారం. సన్‌రైజర్స్ టీమ్ విలియమ్సన్, రషీద్‌ ఖాన్‌లను మాత్రమే రిటైన్ చేసుకోనున్నట్లు తెలుస్తోంది. దీంతో వార్నర్ వేలంలోకి రావడం పక్కా అని తేలిపోయింది. ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ రిషబ్ పంత్, పృథ్వీ షా, అక్షర్ పటేల్, నోర్జ్‌లను రిటైన్ చేసుకోనుంది. దీంతో శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్ వేలంలోకి రానున్నట్లు తెలుస్తోంది. అటు రాజస్థాన్ రాయల్స్ టీమ్ సంజు శాంసన్, బట్లర్, యశస్వి జైశ్వాల్‌ను… పంజాబ్ టీమ్ రవి బిష్ణోయ్, అర్ష్ దీప్‌సింగ్‌లను రిటైన్ చేసుకోనున్నాయి. అయితే ఇది అధికారిక సమాచారం కాదు. త్వరలోనే ఆయా జట్లు రిటైన్ చేసుకునే ఆటగాళ్ల జాబితాను అధికారికంగా ప్రకటించే అవకాశముంది.

Related Articles

Latest Articles