NTV Telugu Site icon

నాసా స‌రికొత్త ప్ర‌యోగం: గ్ర‌హ‌శ‌క‌లాల‌ను ఢీకొట్టేందుకు…

నాసా ఓ స‌రికొత్త ప్ర‌యోగం చేయ‌బోతున్న‌ది. ఈనెల 23 వ తేదీన అంత‌రిక్ష‌లంలోకి ఓ వ్యోమ‌నౌక‌ను ప్ర‌యోగించ‌బోతున్న‌ది. ఈ వ్యోమ‌నౌక విశ్వంలో ప్ర‌యాణించే గ్ర‌హ‌శ‌క‌లాన్ని ఢీకొడుతుంది. డిమోర్ఫాస్‌, డిడైమోస్ అనే గ్ర‌హ‌శ‌క‌లాల‌ను ఢీకొట్టేందుకు ఈ వ్యోమ‌నౌక‌ను ప్ర‌యోగించారు. ఈ గ్ర‌హ‌శ‌కలాలు భూమికి కోటి ప‌దిలక్ష‌ల మైళ్ల దూరంలో ఉన్నాయి. దీనిని చేరుకోవ‌డానికి వ్యోమ‌నౌక‌కు స‌వంత్స‌రం స‌మ‌యం ప‌డుతుంది. భ‌విష్య‌త్తులో ఈ గ్ర‌హ‌శ‌క‌లాల నుంచి భూమికి ముప్పువాటిల్లే ప్ర‌మాదం ఉంద‌ని నాసా శాస్త్ర‌వేత్త‌లు అంచ‌నా వేస్తున్నారు.

Read: వండ‌ర్‌: అమెరికాలోని ఈ గ్రామానికి టెక్నాల‌జీ గురించే తెలియ‌ద‌ట‌… అక్క‌డికి వెళ్లాలంటే…

అందుక‌నే ఈ ప్ర‌యోగాన్ని చేప‌ట్ట‌బోతున్నారు. స్పేస్ క్రాప్ట్ స్పేస్ ఎక్స్ రాకెట్ ద్వారా వ్యోమ‌నౌక‌ను అంత‌రిక్షంలోకి ప్ర‌వేశ‌పెట్ట‌బోతున్నారు. 780 మీట‌ర్ల చుట్టుకొల‌త ఉండే గ్ర‌హ‌శ‌కలాల‌ను భూమికి ప్ర‌మాద‌క‌ర‌మైన గ్ర‌హ‌శ‌క‌లాలుగా భావిస్తారు. అయితే, డిమోర్ఫాస్ 380 మీట‌ర్ల చుట్టుకొత‌తో ఉండ‌టం విశేషం. నాసా ప్ర‌యోగిస్తున్న ఈ వ్యోమ‌నౌక ప్ర‌యోగం విజ‌య‌వంత‌మైతే రాబోయే రోజుల్లో భూమికి ప్ర‌మాద‌క‌రంగా మారే గ్ర‌హ‌శ‌క‌లాల‌ను వ్యోమ‌నౌక‌ద్వారా ఢీకొట్టి వాటిని నిర్వీర్యం చేయ‌వ‌చ్చు.