చంద్రుడిపై కాలు మోపేందుకు, కాలనీలు ఏర్పాటు చేసేందుకు నాసా యుద్దప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నది. దీనికోసం నాసా ఆర్టిమిస్ పేరుతో బృహత్కర ప్రాజెక్టును చేపట్టింది. ఆర్టిమిస్ ప్రాజెక్టులో భాగంగా 2022లో మానవరహిత రాకెట్‌ను చంద్రునిమీదకు పంపించబోతున్నది. అనంతరం 2024 నుంచి మానవసహిత రాకెట్‌లను చంద్రునిమీదకు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. ఇందులో భాగంగా ఆర్టిమిస్ 9 కోసం భారీ బూస్టర్లకు పెద్ద ఎత్తున ఆర్డర్లు చేసింది. నార్తరప్ గ్రూమన్ కు ఈ బూస్టర్ల తయారీ బాధ్యతలను అప్పగించింది. నాసా ప్రాజెక్టులకు బూస్టర్లను ఈ సంస్థే తయారు చేస్తున్న సంగతి తెలిసిందే. 2031లో ఆర్టిమిస్ 9 ను ప్రయోగం చేపట్టాల్సి ఉంటుంది.
Read: విద్యాసంస్థల్లో కరోనా టెన్షన్… 72 గంటల్లో…
భూమినుంచి చంద్రుని మీదకు భారీ ఎత్తున సామగ్రి లేదా ఆస్ట్రోనాట్స్ ను పంపాల్సి ఉంటుంది. దీనికోసం నాసా ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. నాసా స్పేస్ షటిల్స్ కోసం ఎస్ఎల్ఎస్ టెక్నాలజీ బూస్టర్స్‌ను వినియోగిస్తున్నారు. భారీ స్పేస్ షటిల్ కోసం అడ్వాన్డ్స్ బూస్టర్స్ అవసరం అవుతాయని నాసా చెబుతున్నది. అయతే, ఎస్ఎల్ఎస్ బూస్టర్స్ లో కొంత డిజైన్‌లో మార్పులు చేసి అదనంగా కొత్త టెక్నాలజీని జోడించి భారీ బూస్టర్లను తయారు చేయనున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పనులు ఇప్పటికే ప్రారంభమైనట్టు నాసా పేర్కొన్నది. భారీ బూస్టర్లకోసం 3.9 బిలియన్ డాలర్లను వెచ్చిస్తున్నట్టు నాసా తెలియజేసింది.