NTV Telugu Site icon

ఏలియ‌న్స్ జాడ‌ కోసం పూజారుల‌తో నాసా కొత్త ప్ర‌య‌త్నం…

భూమిలాంటి గ్ర‌హాలు ఈ విశాల‌మైన విశ్వంలో అనేకం ఉన్నాయ‌ని ఇప్ప‌టికీ న‌మ్ముతున్నారు.  ఒక‌వేళ గ్ర‌హాల్లో గ్ర‌హాంత‌ర‌వాసులు ఉంటే ఎలా ఉంటారు.  వారు మ‌నుషుల క‌న్నా టెక్నిక‌ల్‌గా అభివృద్ధి సాధించిన వ్య‌క్తులా లేదా, వారి జీవ‌న విధానం ఎలా ఉంటుంది అని తెలుసుకోవ‌డానికి నాసా ఎప్ప‌టినుంచే ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ది.  త్వ‌ర‌లోనే గ్ర‌హాంత‌ర‌వాసుల జాడ‌ను క‌నుగొని తీరుతామ‌ని నాసా చెబుతున్న‌ది. దీనికోసం 24 మంది పూజారుల స‌హాయం తీసుకోబోతున్న‌ది.  వివిధ మ‌తాల‌కు చెందిన నిష్ణాతులైన పూజారుల‌ను దీనికోసం వినియోగించుకోబుతున్న‌ది నాసా.  

Read: శాస్త్ర‌వేత్త‌ల హెచ్చ‌రిక‌: అలా చేయ‌కుంటే… మ‌నుషులు న‌ర‌మాంస‌భ‌క్షుల‌వుతారు…!!

ఒక‌వేళ నాసా ఏలియ‌న్స్ జాడ క‌నుక్కొని వారిని గుర్తిస్తే వివిధ మ‌తాల‌కు చెంద‌ని వారి స్పంద‌న ఎలా ఉంటుంద‌ని తెలుసుకోవ‌డానికి వీరి స‌హాయం తీసుకుంటున్న‌ట్టు టెక్నోట్రెండ్జ్ త‌న నివేదిక‌లో పేర్కొన్న‌ది.  ఈనెల 24 వ తేదీన నాసా అతిపెద్ద తెలిస్కోప్‌ను రోద‌సిలోకి పంపింది.  ఇది విశ్వం పుట్టుక‌కు సంబంధించిన ర‌హ‌స్యాల‌తో పాటు, విశ్వంలోని ఇత‌ర గ్ర‌హాల్లో ఉండే గ్రహాంత‌ర వాసుల జాడ‌ను కూడా క‌నుగొన‌డంలో స‌హాయం చేస్తుంద‌ని నాసా విశ్వ‌సిస్తోంది.  మ‌రి నాసా ప్ర‌యోగించిన జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఏలియ‌న్స్ జాడ‌ను క‌నుగొంటుందా?  విశ్వంలో మ‌నిషి ఒంట‌రివాడు కాద‌నే న‌మ్మ‌కాన్ని నిల‌బెడుతుందా చూడాలి.