NTV Telugu Site icon

ప్రకాశ్ రాజ్ ప్రశ్నకు నరేశ్ కౌంటర్!

‘ఎలక్షన్స్ ఎప్పుడు?’ అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించిన ప్రకాశ్ రాజ్ కు సీనియర్ నటుడు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు నరేశ్ అదే సోషల్ మీడియా ముఖంగా బదులిచ్చారు. 2019లో ఎన్నికైన ‘మా’ కార్యవర్గ కాలపరిమితి పూర్తయినా ఇంకా ఎన్నికలు జరపడం లేదు ఎందుకుంటూ ప్రకాశ్ రాజ్ పరోక్షంగా జస్ట్ ఆస్కింగ్ అంటూ ప్రశ్నించారు. దీనికి కొద్దికాలం ముందే ఈసారి ‘మా’ ఎన్నికల్లో తన ప్యానెల్ పోటీ చేస్తుందని ప్రకాశ్ రాజ్ చెప్పారు.

Read Also: శుక్రవారం ఆహాలో మరో రెండు!

అయితే… ప్రకాశ్ రాజ్ ప్రశ్నను నరేశ్ సీరియస్ గానే తీసుకున్నారు. కానీ తన సమాధానంకు కాస్తంత చమత్కారం జోడించి ఇచ్చారు. ” ‘మా’ సర్వసభ్య సమావేశంలో ఎన్నికలకు సంబంధించి చేసిన తీర్మానం కాపీని చూసిన తర్వాత కూడా కొందరు ఎలక్షన్స్ ఎప్పుడు? అని అడగడం చిత్రంగా ఉంది. వాళ్ళను చూస్తుంటే నీళ్ళు లేని స్విమ్మింగ్ పూల్ లోకి దూకమంటారా? అని అడుగుతున్నట్టుగా ఉంది. వారికి మా సమాధానం ఒక్కటే ‘దూకండి’ అని! అంటూ నరేశ్ పేర్కొన్నారు. ప్రకాశ్ రాజ్ గతంలో ఎన్నికల విషయమై ప్రశ్నించినప్పుడు ‘మా’ ఆఫీస్ నుండి ఆయనకు పంపిన ఈ-మెయిల్ కాపీని కూడా నరేశ్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. మొత్తానికి ‘మా’ గొడవ ఇప్పుడు మీడియా నుండి సోషల్ మీడియాకు చేరినట్టు అయ్యింది.