శుక్రవారం ఆహాలో మరో రెండు!

గత వారం పదహారు చిత్రాలతో సందడి చేసిన ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్ ఈ శుక్రవారం మరో రెండు చిత్రాలను స్ట్రీమింగ్ చేయబోతోంది. అందులో ఒకటి స్ట్రయిట్ తెలుగు సినిమా ‘ఒక చిన్న విరామం’ కాగా, మరొకటి తమిళ అనువాద చిత్రం ‘విక్రమార్కుడు’.

సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ మూవీ ‘ఒక చిన్న విరామం’లో పునర్నవి భూపాలం, గరిమ, నవీన్ నేని ముఖ్యపాత్రలు పోషించారు. దీన్ని స్వీయ దర్శకత్వంలో సుదీప్ చెగూరి నిర్మించారు. కథ విషయానికి వస్తే బిజినెస్ మేన్ అయిన దీపక్ తనను ప్రేమించిన వారి కోసం ఎంత దూరమైనా వెళ్ళే వ్యక్తి. గర్భవతి అయిన భార్య సమీరా కోసం అతను బాలు, మాయ సాయం కోరతాడు. అప్పుడేం జరిగిందనే విషయాన్ని ఉత్కంఠభరితంగా దర్శకుడు తెరకెక్కించాడు. ఇక మరొకటి ‘విక్రమార్కుడు’గా తెలుగులో డబ్ అయిన తమిళ చిత్రం ‘జుంగ’. విజయ్ సేతుపతి హీరోగా గోకుల్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఓ తగాదాలో జుంగ తన పూర్వీకుల ఆస్తిని, థియేటర్ ను కోల్పోతాడు. అటువంటి వ్యక్తికి ప్యారిస్ వెళ్ళే పని పడుతుంది. విదేశానికి వెళ్ళిన తర్వాత తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి డాన్ గా మారి క్రిమినల్ గ్యాంగ్ తో పోరాడాల్సి వస్తుంది. ఆ క్రమంలో అతను పొందింది ఏమిటి? కోల్పోయింది ఏమిటనేదే ‘విక్రమార్కుడు’ కథ.

ఈ రెండు సినిమాలు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటాయనే ఆశాభావాన్ని ఆహా టీమ్ వ్యక్తం చేస్తోంది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-