నాగ్ ‘బిగ్‌బాస్ సీజన్ -5’ ప్రొమో వచ్చేసింది!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టెలివిజన్ చరిత్రలోనే అత్యధికంగా వీక్షించిన రియాల్టీ షోలలో బిగ్‌బాస్ తెలుగు కూడా ఒకటి. గత సంవత్సరం 15 వారాల పాటు జరిగిన సీజన్, తెలుగు రాష్ట్రాలలో ప్రతి ఇంటినీ చేరువయింది. బిగ్‌బాస్ సీజన్ ముగిసిన వెంటనే తరువాత సీజన్ ఎప్పుడు ఆరంభమవుతుందోనంటూ ఆసక్తిగా ఎదురుచూస్తూ, చర్చలు చేస్తోన్న అభిమానులూ ఎంతో మంది ఉన్నారు. ఈ నిరీక్షణకు తెరదించుతూ బిగ్ బాస్ సీజన్ 5 ప్రొమోను విడుదల చేసింది స్టార్ మా. షో తిరిగి ఎప్పుడు ప్రారంభమవుతుందోననే ఎదురుచూపులు… ఈసారి ఎవరు హౌస్‌లో ఉండబోతున్నారనే చర్చలు… చేస్తున్న నయా విశ్లేషకులలో ఆసక్తిని రేపుతూ పూర్తి చమత్కారంగా ఈ ప్రొమో తీర్చిదిద్దారు.
Read Also: ఆగస్ట్ 22 నుంచీ ఎన్టీఆర్ ‘ఎవరు మీలో కోటీశ్వరులు’!
Also Read
- UK: బ్రిటన్ ప్రధానిగా ఆండీ బర్న్‌హామ్.. సోమవారం బాధ్యతలు స్వీకరణ
- Sonam Wangchuk: సోనం వాంగ్‌చుక్ దీక్షలో నవ్వులు.. పువ్వులు.. ఏం జరిగిందంటే..!
- Supreme Court: ‘సర్’లో పేరు లేకపోతే పౌరసత్వం లేనట్టేనా.. సంక్షేమ పథకాలు నిలిపేస్తారా? సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
- Pakistan: సింధు జలాలపై పాక్‌కు ఝలక్.. భారత్ దెబ్బకు విలవిల
మొట్టమొదటిసారిగా ఓ మ్యూజిక్ వీడియో రూపంలో విడుదల చేసిన ఈ ప్రొమోలో కింగ్ నాగార్జున, వినోదమనే బుల్లెట్లను నింపిన గన్‌తో ‘విసుగు’ను చంపే సెక్సీ, సరసపు కిల్లర్‌గా కనిపించ నున్నారు. మిస్టర్ విసుగు, బిగ్‌బాస్ నడుమ జరిగిన ముఖాముఖిలో ఈ విసుగును నాగార్జున తన వినోదపు బుల్లెట్‌తో చంపడంతో ప్రతి ఒక్కరూ ఆనంద కేళిలో మునిగిపోతారు. ఈసారి బిగ్‌బాస్ షో యాక్షన్, డ్రామా, రొమాన్స్, వినోదం, ఆహ్లాదం సమ్మేళనంగా ఉండటమే కాదు గత సీజన్లతో పోలిస్తే మరింత పెద్దగా, ఉత్తమంగా ఉంటుందనే వాగ్ధానమూ చేశారు.
Read Also: విశ్వక్ ఓవర్ యాక్షన్ తగ్గించు!?
బిగ్‌బాస్ సీజన్ 5 ప్రొమోకు ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించగా, ఫోటోగ్రఫీ డైరెక్టర్‌గా జె. యువరాజ్ ఉన్నారు. ఈ ప్రొమో సాంగ్ కు సంగీతాన్ని యశ్వంత్ నాగ్ అందిస్తే, రాహుల్ సిప్లిగంజ్ ఆలపించారు. కొద్ది రోజుల క్రితమే బిగ్‌బాస్ లోగో విడుదలైంది. దారి తెలియని ఓ చిట్టడవి నుంచి బయటకు రావడానికి ఎలాగైతే యుక్తిని ప్రదర్శించాలో అదే రీతిలో బిగ్‌బాస్ హౌస్ నుంచి విజేతగా బయటకు రావడానికి చూపాల్సిన యుక్తిని గుర్తుకు తెచ్చే రీతిలో ఈ లోగో రూపుదిద్దుకుంది. సో… ఇక అధికారికంగా బిగ్ బాస్ మొదలయ్యేది ఎప్పుడో చెప్పడమే మిగిలి ఉంది.
తాజావార్తలు
-
Citizenship: భూమి పత్రాలు పౌరసత్వానికి ఆధారం కాదు: కలకత్తా హైకోర్టు..
-
UK: బ్రిటన్ ప్రధానిగా ఆండీ బర్న్‌హామ్.. సోమవారం బాధ్యతలు స్వీకరణ
-
Ponnam Prabhakar: అలాంటి వాహనాలను సీజ్ చేయండి.. మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ వార్నింగ్..
-
Sonam Wangchuk: సోనం వాంగ్‌చుక్ దీక్షలో నవ్వులు.. పువ్వులు.. ఏం జరిగిందంటే..!
-
Gambhir-Kohli: గంభీర్-కోహ్లీ మధ్య ‘కోల్డ్ వార్’.. తొలి సారి నోరు విప్పిన టీమిండియా కోచ్!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?