NTV Telugu Site icon

UP: హిందు అబ్బాయిని పెళ్లాడిన ముస్లిం అమ్మాయి.. గన్ తో బెదిరించి మతం మార్చిన ముస్లిం పెద్దలు!.. స్టేషన్ లో ఫిర్యాదు

Up3

Up3

ఉత్తర్ ప్రదేశ్ బరేలీకి చెందిన ఓ జంట మత మార్పిడికి పాల్పడ్డారు. వీరిద్దరూ కొద్ది రోజుల క్రితం ఓ ఆశ్రమంలో హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు. అయితే ఇప్పుడు బలవంతపు మత మార్పిడిపై వీరిద్దరూ పోలీస్ స్టేషన్‌లో వేర్వేరుగా ఫిర్యాదు చేశారు. దీనిపై ఇరువర్గాల నుంచి దరఖాస్తులు వచ్చాయని, విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు. అబ్బాయి హిందువు కాగా, అమ్మాయి ముస్లిం. గతంలో మతం మార్చుకుని పెళ్లి చేసుకున్నాడని అమ్మాయి ఆరోపించగా.. ఇప్పుడు అబ్బాయి కూడా అదే ఆరోపణ చేశాడు.

READ MORE: Chickpea: నానబెట్టిన శనగలతో ఎన్ని లాభాలో..!

 

ప్రేమ్‌శంకర్ తెలిపిన వివరాల ప్రకారం.. అతను ముస్లిం యువతి హీనాతో ప్రేమలో పడ్డాడు. ఇద్దరు కలిసి ఉత్తరాఖండ్‌లోని ఓ కంపెనీలో పనిచేసేవారు. అక్కడే వారిద్దరూ మొదట కలుసుకున్నారు. ఆ తర్వాత స్నేహితులయ్యారు. క్రమంగా దగ్గరయ్యారు. చివరకు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీని తరువాత.. హినా తన స్వంత ఇష్టానుసారం హిందూ మతాన్ని స్వీకరించింది. శుద్ధి చేసిన తర్వాత బరేలీలోని పండిట్ కేకే శంఖ్‌ధర్ ఆశ్రమంలో ప్రేమశంకర్‌తో ఏడడుగులు నడిచింది. వారిద్దరూ జులై 11న వివానం చేసుకున్నారు. హీనా తన పేరును ప్రియాంక దేవిగా మార్చుకుంది. పెళ్లికి సంబంధించిన చాలా వీడియోలు, పెళ్లి తర్వాత చాలా ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. ఇందులో ఇద్దరూ చాలా హ్యాపీగా కనిపిస్తున్నారు. ప్రేమ కోసమే హీనా మతం మార్చుకుని ప్రియాంక అని పేరు పెట్టుకుంది. కానీ కొద్ది రోజులకే ప్రేమశంకర్ నిహాల్ ఖాన్‌గా మారిపోయాడు. కానీ ప్రేమ్ శంకర్ సున్తీ చేయించుకోవాలని హీనా కుటుంబం పట్టుబట్టడంతో అతను పారిపోయి పోలీసులకు జరిగిన కథంతా చెప్పాడు.

READ MORE: Karnataka: ఆగని దారుణాలు.. చికిత్స కోసం వచ్చిన మహిళపై అత్యాచారం

ప్రేమ్‌శంకర్ మీడియాతో మాట్లాడుతూ…. “ఆగస్టు 18న, పెళ్లయిన కొద్ది రోజులకే, తన తండ్రి అనారోగ్యంతో ఉన్నారని చెప్పి, నన్ను పిలిభిత్‌లోని దర్గాకు తీసుకెళ్లింది. అక్కడ ఆమె కుటుంబ సభ్యులు నన్ను బందీగా పట్టుకుని బలవంతంగా ఇస్లాంలోకి మార్చారు. హీనా కుటుంబ సభ్యులు తుపాకీతో బెదిరించారు. నమాజ్ కూడా చేయించారు. ముస్లింగా మార్చిన తర్వాత.. నాకు నిహాల్ ఖాన్ అని పేరు పెట్టారు. సున్తీ చేయమని కూడా ఒత్తిడి తెచ్చారు. చంపేస్తామని బెదిరించారు. ఎలాగోలా పారిపోయి తప్పించుకున్నాను. రెండేళ్లుగా ఇద్దరం మాట్లాడుకుంటున్నాం. హిందు సాంప్రదాయం ప్రకారం.. పెళ్లి కూడా జరిగింది. హిందువుగా మారి నాతో కలిసి జీవిస్తానని గతంలో ఆమె (హీనా) చెప్పింది. హీనా, ఆమె కుటుంబం యొక్క ఉద్దేశ్యం సరైనది కాదు. వారు నన్ను బలవంతంగా ట్రాప్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు.” అని ప్రేమ్ శంకర్ పేర్కొన్నాడు.

 

READ MORE: Mumbai: ముంబైలో దారుణం.. సోషల్ మీడియాలో పరిచయమైన బాలికపై అత్యాచారం

కాగా.. ఈ ఘటనపై అబ్బాయి పారిపోయిన తర్వాత వంటనే అమ్మాయి కుటుంబానికి చెందిన పెద్దలు స్టేషన్ లో మత మార్పిడి కింద ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత అబ్బాయి బయటకు వచ్చి జరిగిన విషయం చెప్పి తాను కూడా ఓ ఫిర్యాదు అందజేశాడు. ప్రస్తుతం ఈ వ్యవహారాన్ని పోలీసు అధికారులు సీరియస్‌గా తీసుకుని విచారణ చేపట్టారు. జులై నెలలో ఓ హిందూ యువకుడు, ముస్లిం యువతి పెళ్లి చేసుకున్నట్లు ఏరియా అధికారి తెలిపారు. ఆ తర్వాత ఆగస్టు 17, 20 తేదీల్లో బలవంతపు మత మార్పిడికి పాల్పడ్డారని ఫిర్యాదు లేఖలు ఇచ్చుకున్నారు. ఈ మొత్తం ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. విచారణ అనంతరం అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.