Site icon NTV Telugu

అక్రమ విల్లాలపై మున్సిపల్‌ అధికారుల నజర్‌

అక్రమ విల్లాలపై హైదరాబాద్‌ మున్సిపల్‌ అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు. దుడింగల్‌ మల్లంపేటలో అక్రమ విల్లాలపై ప్రభుత్వం సీరియస్‌ అవడంతో అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నెలాఖరులోగా అక్రమ విల్లాలపై పూర్తిస్థాయి రిపోర్ట్‌ ఇవ్వాలని మున్సిపల్‌ కమిషనర్‌కు తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో మల్లంపేటలోని లక్ష్మీశ్రీనివాస్‌ పేరుతో 65 విల్లాలకే హెచ్‌ఎండీఏ అనుమతి ఇచ్చింది.

అయితే 260 విల్లాలకు అనుమతి ఉందంటూ లక్ష్మీశ్రీనివాస్‌ సంస్థ నకిలీ పత్రాలు సృష్టించింది. అంతేకాకుండా 325 విల్లాలు నిర్మించింది. అయితే వీటిలో 260 విల్లాలను అధికారులు అక్రమంగా నిర్మించినట్లు గుర్తించారు. దీంతో ఇప్పటికే 100 విల్లాలను సీజ్‌ చేశారు. మరో 100 విల్లాలను కూడా సీజ్‌ చేయనున్నట్లు మున్సిపల్‌ అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉంటే.. లక్ష్మీశ్రీనివాస్‌ సంస్థ దగ్గర విల్లాలు కొన్న బాధితులు ఆందోళన చెందుతున్నారు.

Exit mobile version