Site icon NTV Telugu

కేసీఆర్‌పై అభిమానాన్ని చాటిన ఎంపీ సంతోష్‌..

గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సృష్టికర్త రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌ కుమార్‌ సీఎం కేసీఆర్‌పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. నేడు సంతోష్‌ కుమార్‌ బర్త్‌ డే సందర్భంగా ఆయన ట్విట్టర్‌ వేదికగా కేసీఆర్‌ తనను చిన్నప్పుడు భుజాలపై ఎత్తుకున్న ఫోటోను షేర్‌ చేస్తూ.. “ఈ పుట్టుక నాది.. బ్రతుకంతా మీది …” అంటూ క్యాప్షన్‌ పెట్టారు.

దీంతో నెట్టింట ఈ పిక్‌ వైరల్‌గా మారింది. అంతేకాకుండా టీఆర్‌ఎస్‌ అభిమానులు, ఎమ్మెల్యేలు, మంత్రులతో పాటు రాజకీయ ప్రముఖులు సంతోష్‌కు బర్త్‌డే విషెస్ చెబుతూ.. అభినవ అశోకుడని, ప్రకృతి ప్రేమికులు, పర్యావరణ పరిరక్షకులు అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Exit mobile version