ఏడాది కాలంగా టాలీవుడ్లో వరుస విషాదాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటుచేసుకున్నాయి. నాలుగు రోజుల్లో ముగ్గురు ప్రముఖులు మృతి చెందడంతో టాలీవుడ్‌కు ఏమైందంటూ పలువురు చర్చించుకుంటున్నారు. నవంబర్ 27న ప్రముఖ డైరెక్టర్ కేఎస్ నాగేశ్వరరావు గుండెపోటుతో కన్నుమూశారు. ఒక్కరోజు గ్యాప్‌లో అంటే నవంబర్ 28న ప్రముఖ నృత్య దర్శకుడు శివశంకర్ మాస్టర్ కరోనా వల్ల ఊపిరితిత్తులు ఫెయిల్ కావడంతో హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ఈ విషాదం నుంచి తేరుకోకముందే మరో రెండు రోజుల గ్యాప్‌లో నవంబర్ 30న దిగ్గజ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి న్యూమోనియాతో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.

Read Also: రెండో టెస్టులో కోహ్లీ కోసం బలయ్యేదెవరు?
Also Read
- DK.Shivakumar: డీకే.శివకుమార్ కేబినెట్‌పై విమర్శలు.. మహిళలకు చోటు లేకపోవడంపై నిలదీత
- Sonam Raghuvanshi: హనీమూన్ మర్డర్ కేసులో సోనమ్ బెయిల్ పిటిషన్ రద్దుపై కీలక పరిణామం.. సర్వత్రా ఉత్కంఠ
- Modi-Delcy Rodriguez: మోడీతో వెనిజులా అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ భేటీ.. ఇరు దేశాల సంబంధాలపై చర్చ
- Mojtaba Khamenei: శత్రువుల కుట్రలపై అప్రమత్తంగా ఉండాలి.. ఇరానీయులకు మొజ్తబా ఖమేనీ సందేశం
మరోవైపు ఈ ఏడాది టాలీవుడ్‌కు అచ్చిరాలేదనే చెప్పాలి. ఎందుకంటే గత ఏడాది కాలంగా చాలా మంది ప్రముఖులను టాలీవుడ్ కోల్పోయింది. వేదం మూవీతో ఆకట్టుకుని ఎన్నో సినిమాల్లో నటించిన నాగయ్య ఈ ఏడాది మార్చి 27న చనిపోయారు. ప్రముఖ నిర్మాత, పీఆర్వో బీఏ రాజు మే 22న గుండెపోటుతో మరణించారు. అంతకంటే ముందు మే 10న కరోనాతో ప్రముఖ నటుడు, జర్నలిస్ట్ టీఎన్ఆర్ తుదిశ్వాస విడిచారు. ఆ తర్వాత సీనియర్ నటి జయంతి శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతూ జూలై 26న చనిపోయారు. ప్రముఖ సీనియర్ నటుడు నర్సింగ్ యాదవ్ కిడ్నీ సంబంధిత వ్యాధితో గత ఏడాది డిసెంబర్ 31న కన్నుమూశారు. ఇలా తోటి కళాకారులు, సినీ ప్రముఖులు వరుసగా మరణిస్తుండటంతో టాలీవుడ్ దిగ్భ్రాంతిలో కూరుకుపోయినట్లు కనిపిస్తోంది.
తాజావార్తలు
-
Test Match: ఆఫ్ఘనిస్తాన్‌తో టెస్ట్ మ్యాచ్.. సిరాజ్ ఫిట్‌నెస్‌పై కోచ్ కీలక వ్యాఖ్యలు
-
Ameerpet Fire Accident : మెట్రో పిల్లర్‌కు క్రాక్.. క్లారిటీ ఇచ్చిన మెట్రో అధికారులు
-
World Cup: కేవలం 30 సెకన్ల మీటింగ్.. వరల్డ్ కప్ కొట్టిన భారత్.. సంచలన రహస్యం చెప్పిన కెప్టెన్..
-
High Protein Roti Recipe: గోధుమ పిండిలో ఈ 3 పదార్థాలు కలపండి.. హై ప్రోటీన్ రోటీ రెడీ..
-
Forbes Billionaires List: 4 గదుల ఫ్లాట్ నుంచి 92.8 బిలియన్ డాలర్ల సామ్రాజ్యం వరకు..! అంబానీని దాటేసిన టిక్‌టాక్ సృష్టికర్త..
ట్రెండింగ్
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!