Site icon NTV Telugu

Rahul Tripathi: రనౌట్ అయిన తర్వాత మెట్లపై కూర్చొని ఎలా బాధపడుతున్నాడో చూడండి..

Rahul

Rahul

ఐపీఎల్ 2024 క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఎస్ఆర్హెచ్.. ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్ దిగిన ఓపెనర్లు పెద్దగా పరుగులేమీ చేయకుండానే పెవిలియన్‌కు చేరుకున్నారు. ఆ తర్వాత రాహుల్ త్రిపాఠి క్రీజులోకి వచ్చి జట్టు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే బాధ్యత తీసుకున్నాడు.

KKR vs SRH: ఫైనల్కు కేకేఆర్.. సన్ రైజర్స్పై ఘన విజయం

రాహుల్ త్రిపాఠి ఈ సీజన్ లో తన మొదటి అర్ధ సెంచరీని సాధించాడు. కానీ హాఫ్ సెంచరీ చేసిన తర్వాత అతను రనౌట్ అయ్యాడు. రాహుల్ త్రిపాఠి తన స్వంత తప్పిదం కారణంగా రనౌట్ అయ్యాడు. నేరుగా రస్సెల్ దగ్గరికి పోయిన బంతి త్రో విసిరి అతన్ని రనౌట్ చేశాడు. కాగా.. రనౌట్ తో వెనుదిరిగిన త్రిపాఠి ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో రాహుల్ త్రిపాఠి రన్ అవుట్ అయిన తర్వాత మెట్ల దగ్గరే కూర్చొని బాధపడుతున్నట్లు కనిపించింది.

US: ఇరాన్ అధ్యక్షుడి మృతి వెనుక కుట్ర లేదు

త్రిపాఠి తన ముఖాన్ని తన చేతులతో దాచిపెట్టుకుని ఫొటోలో ఉండటం చూడొచ్చు. అయితే అభిమానులు మాత్రం సోషల్ మీడియాలో ట్వీట్లు చేస్తూ అతన్ని ప్రోత్సహిస్తున్నారు. రాహుల్ త్రిపాఠి జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో మంచి ఇన్నింగ్స్ ఆడావని ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ మద్దతుగా నిలుస్తున్నారు. కీలక సమయంలో జట్టుకు బ్యాటింగ్‌తో సహకరించాడు. 14వ ఓవర్‌లో సునీల్ నరైన్ వేసిన బంతికి అబ్దుల్ సమద్ షాట్ కొట్టగా.. రన్ తీయడానికి ఇద్దరు ప్రయత్నించారు. కానీ బంతి నేరుగా రస్సెల్ దగ్గరికి వెళ్లడంతో.. వెంటనే సమద్ వెనక్కి వెళ్లమని చెప్పాడు. అప్పటికే బంతిని స్ట్రైకర్ ఎండ్ వైపు విసిరాడు. దీంతో రాహుల్ త్రిపాఠి రనౌట్ అయ్యాడు. రస్సెల్ అద్భుతంగా ఫీల్డింగ్ చేసి డైవింగ్ ద్వారా బంతిని పట్టి రాహుల్ ను పెవిలియన్‌కు పంపించాడు.

Exit mobile version