కరోనా వ్యాక్సినేషన్ పై ప్రధాని మోడీ కీలక ప్రకటన చేశారు. జనవరి 3 నుంచి పిల్లలకు వ్యాక్సినేషన్ ప్రారంభం కానుందని ప్రధాని మోడీ పేర్కొన్నారు. 15-18 ఏళ్ళ వారికి వ్యాక్సిన్ కొనసాగుతుందన్నారు మోడీ. జాతి నుద్దేశించి ప్రధాని మోడీ ఇవాళ ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఒమిక్రాన్ వ్యాపిస్తోందని… ఒమిక్రాన్ విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. పిల్లల కోసం బెడ్స్ సిద్ధంగా వున్నాయని… కరోనాను మనం సమర్థంగా ఎదుర్కొన్నామన్నారు. మనం వ్యాక్సిన్ల విషయంలో అందరికంటే ముందున్నాని వెల్లడించారు. దేశంలో అర్హులైన 61శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తిచేశామని… దేశంలో గత జనవరి 26 నుంచి వ్యాక్సినేషన్ ప్రారంభమయిందని ప్రకటన చేశారు ప్రధాని మోడీ.