Site icon NTV Telugu

సిరివెన్నెలకు తగిన గుర్తింపు దక్కలేదు- ఎమ్మెల్సీ మాధవ్

అనారోగ్యంతో కన్నుమూసిన ప్రముఖ సినీ గేయరచయిత, మానవతావాది సిరివెన్నెల సీతారామశాస్త్రి లేని లోటు తీర్చలేనిదన్నారు బీజేపీ నేత, ఎమ్మెల్సీ మాధవ్. ఆయనకు తగిన గుర్తింపు లభించలేదని, మరిన్ని అవార్డులు ఆయనకు లభించాలన్నారు మాధవ్. ఆయనతో తమ కుటుంబానికి వున్న అనుబంధాన్ని మాధవ్ గుర్తుచేసుకున్నారు. తన తండ్రికి ఆయన ఎంతో సన్నిహితులు అన్నారు.

సినీ ప్రస్థానానికి రాకముందే సమాజాన్ని మరింతగా చైతన్య పరిచారన్నారు. ప్రజల్ని అలరించడమే కాదు సామాజిక బాధ్యత ఆయన రచనల్లో వుండేదన్నారు. ఆయన సామాజికంగా, రాజకీయంగా, ఆధ్యాత్మికంగా ఆయనకు మంచి అవగాహన వుందన్నారు. ఆయనలో అనేక పార్శ్యాలున్నాయన్నారు. ఆయనకు రెండు తెలుగు రాష్ట్రాలు మరింతగా గౌరవించాలన్నారు. జాతీయ అవార్డుతో గౌరవించి ఆయన ఆత్మకు శాంతి కలిగించాల్సిన అవసరం వుందన్నారు ఎమ్మెల్సీ మాధవ్.

Exit mobile version