అనారోగ్యంతో కన్నుమూసిన ప్రముఖ సినీ గేయరచయిత, మానవతావాది సిరివెన్నెల సీతారామశాస్త్రి లేని లోటు తీర్చలేనిదన్నారు బీజేపీ నేత, ఎమ్మెల్సీ మాధవ్. ఆయనకు తగిన గుర్తింపు లభించలేదని, మరిన్ని అవార్డులు ఆయనకు లభించాలన్నారు మాధవ్. ఆయనతో తమ కుటుంబానికి వున్న అనుబంధాన్ని మాధవ్ గుర్తుచేసుకున్నారు. తన తండ్రికి ఆయన ఎంతో సన్నిహితులు అన్నారు. సినీ ప్రస్థానానికి రాకముందే సమాజాన్ని మరింతగా చైతన్య పరిచారన్నారు. ప్రజల్ని అలరించడమే కాదు సామాజిక బాధ్యత ఆయన రచనల్లో వుండేదన్నారు. ఆయన సామాజికంగా, రాజకీయంగా,…
సిరివెన్నెల సీతారామ శాస్త్రి దాదాపు 3000 పాటలకు రాశారు. ఇక ప్రత్యేకంగా పొందుపరిచిన ఆయన పాటలు, రూపకాలు, ఛందస్సు, కవిత్వం, ప్రాసలకు ప్రసిద్ధి చెందాయి. తెలుగు సాహిత్యంలో నేటి తరానికి అర్థమయ్యేలా పాటలు రచించడంలో ఆయన స్టైల్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది.త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆయనకు వరుసకు అల్లుడు అవుతారని అందరికి తెలిసిన విషయమే. త్రివిక్రమ్ టాలెంట్ ను రచయితగా ఉన్నప్పుడే గుర్తించిన సీతారామశాస్త్రి ఆయన సోదరుడు కూతురిని ఇచ్చి వివాహం చేశారు. అనంతరం వారి బంధం…