ఆంధ్రప్రదేశ్‌లో 3 గ్రాడ్యుయేట్, 2 టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 5 ఎమ్మెల్సీ స్థానాలను ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 8 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకూ కొనసాగుతుంది. ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి మొత్తం ఆరు జిల్లాల్లో 331 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం అనకాపల్లి జిల్లాలో 49, అల్లూరి జిల్లాలో 15, విజయనగరం జిల్లాలో 72, మన్యం జిల్లాలో 24, శ్రీకాకుళం జిల్లాలో 59 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఓటర్లు స్వేచ్చగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని అధికారులు సూచించారు.
Also Read:TSPSC Paper Leak: TSPSC పరీక్ష పేపర్ లీక్ వ్యవహారంలో ట్విస్ట్.. వెలుగులోకి షాకింగ్ విషయాలు
ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు, కడప-అనంతపురం-కర్నూలు, శ్రీకాకుళం-విజయనగరం-విశాఖ జిల్లాల్లో గ్రాడ్యుయేట్.. ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు, కడప-అనంతపురం-కర్నూలు జిల్లాల్లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. బ్యాలెట్ విధానంలో ఓటింగ్ జరుగుతోంది. ప్రయారిటీ ఓటింగ్ కాబట్టి బ్యాలెట్ పేపర్‌లో పార్టీల గుర్తులు ఉండవు. అభ్యర్థుల పేర్లు, వారి ఫొటోల ఎదురుగా 1, 2, 3 అనే అంకెలు మాత్రమే వేయాల్సి ఉంటుంది. బ్యాలెట్ పేపర్ పై టిక్ మార్క్ లు, సంతకాలు ఇతర ఎలాంటి మార్కింగ్ చేసినా ఓట్లు చెల్లుబాటు కావు. ఎన్నికలు జరిగే 9 జిల్లాల్లో కోడ్ అమలులో ఉంది. ఈ నెల 16న ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుంది.
Also Read:Boats Overturn: కాలిఫోర్నియా తీరంలో పడవలు బోల్తా.. 8 మంది మృతి
మొత్తం 5 ఎమ్మెల్సీ స్థానాలను దక్కించుకోవాలని అధికార, విపక్ష పార్టీ ఉవ్విలూరుతున్నాయి. ఉత్తరాంధ్రలో అధికార వైఎస్ఆర్సీ అభ్యర్థి సీతరాజు సుధాకర్, బీజేపీకి చెందిన పీవీఎన్. మాధవ్, టీడీపీ అభ్యర్థి వేపాడ చిరంజీవి రావు, వామపక్ష మద్దతుతో PDF అభ్యర్థి కె. రమాప్రభ సా ఈ నియోజకవర్గం నుండి 37 మంది అభ్యర్థులలో ఉన్నారు. అనంతరం ఫలితాలు ప్రకటిచంనున్నారు. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు గ్రాడ్యుయేట్ బరిలో 22 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. కడప, అనంతపురం గ్రాడ్యుయేట్ బరిలో 49 మంది అభ్యర్థులు, కడప, అనంతపురం ఉపాధ్యాయ బరిలో 12 మంది అభ్యర్థులు ఉన్నారు. ఇక, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు ఉపాధ్యాయ బరిలో 12 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
Also Read:Mexico Bar Shooting: బార్‌లో కాల్పులు.. 10 మంది దుర్మరణం
ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో మద్యం షాపులను బంద్ చేయడంతోపాటు పోలీసు బందోబస్తు పెంచారు. ప్రశాంతమైన వాతావరణంలో పోలింగ్ జరిగేందుకు పెద్ద సంఖ్యలో సిబ్బందిని నియమించినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. అల్లూరి జిల్లాలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. పార్వతీపురం జిల్లాలో 15 మండలాల పరిధిలో 24 పోలింగ్ కేంద్రాల్లో 8మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయి. ఆయా కేంద్రాల్లో ఉదయం 8 గంటల నుంచి 4 గంటల వరకే పోలింగ్ జరుగుతుందని అధికారులు తెలిపారు. బాపట్ల జిల్లాలో 2 తీవ్ర సమస్యాత్మక, 7 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద అదనపు బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో 4 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులు సూచించారు.