Site icon NTV Telugu

బీజేపీ సభలు హాస్యాస్పదం..రోజా సెటైర్

ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. ఒకవైపు టీడీపీ నిరసనలు, మరోవైపు బీజేపీ సభలతో వైసీపీని టార్గెట్ చేశాయి. అయితే బీజేపీ సభల్ని వైసీపీ నేతలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఏపీలో బీజేపీ సభలు పెట్టడం హాస్యాస్పదం అన్నారు నగరి ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ రోజా. ప్రజలు టీడీపీ,బీజేపి మీద ఆగ్రహంగా వున్నారన్నారు.

https://ntvtelugu.com/ysrcp-general-secretary-sajjala-ramakrishna-reddy-fires-on-bjp-prajagraha-sabha/

విభజన హామీలను నెరవేర్చకుండా బీజేపీ ఏపీ ప్రజల్ని మోసం చేస్తోందన్నారు. రాష్ర్టం అప్పులు చేస్తుందన్న బీజేపీ….కేంద్రం చేస్తున్న అప్పుల సంగతి గుర్తుకు రావడం లేదా? అని ప్రశ్నించారు. సినిమా టిక్కెట్ల ధరల అంశంపై ప్రభుత్వంతో సినిమా పెద్దల మధ్య చర్చలు జరుగుతున్నాయన్నారు. దీనిపై ఒక సానుకూల నిర్ణయం వస్తుందని భావిస్తున్నాం అన్నారు రోజా.

Exit mobile version