AP Assembly: అసెంబ్లీలో కోటంరెడ్డి నిరసన.. వైసీపీ మంత్రుల ఆగ్రహం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ అసెంబ్లీలో వైసీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే కోటంరెడ్డి ప్రభుత్వానికి తలనొప్పిగా మారారు.రెండోరోజునుంచే ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలతో రెడీ అయ్యారు. వైసీపీ దూరంగా ఉంటున్న నెల్లూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అసెంబ్లీలో నిరసనకు దిగారు. నియోజకవర్గ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు. మైక్ ఇచ్చే వరకు అసెంబ్లీలో అడుగుతూనే ఉంటానని కోటంరెడ్డి స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి తన నిరసన కొనసాగుతుందన్నారు. సమస్యలు పరిష్కరిస్తే సీఎంను అభినందిస్తా అని చెప్పారు. నాలుగేళ్లుగా సమస్యల పరిష్కారం కోసం తిరిగి తిరిగి విసిగిపోయానని కోటంరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read:AP Budget Session: రెండో రోజు అసెంబ్లీ సమావేశాలు… గవర్నర్ ప్రసంగంపై చర్చ
అయితే, కోటంరెడ్డి సభను అడ్డుకునేందుకే వచ్చారని మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. శ్రీధర్‌రెడ్డిపై టీడీపీకి ఇప్పుడు ప్రేమ వచ్చిందా? అని ప్రశ్నించారు. చంద్రబాబు, టీడీపీ కోసం కోటంరెడ్డి పని చేస్తున్నారని అంబటి ఆరోపించారు.టీడీపీతో చేతులు కలిపి దురుద్దేశ్యంతోనే కోటంరెడ్డి ఆందోళన చేస్తున్నాడరని ఆగ్రహం వ్యక్తం చేశారు. నైతిక విలువలేని వ్యక్తి శ్రీధర్‌రెడ్డి అని, చంద్రబాబు మెప్పుకోసం మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
- RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
ఆర్థిక మంత్రి బుగ్గనరాజేంద్రనాథ్ కూడా కోటంరెడ్డి తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. వ్యక్తిగత అంశాలకు సభలో చోటులేదని ఆయన అన్నారు. ప్రజా సమస్యలు ఏమైనా ఉంటే సంబంధింత మంత్రులు, అధికారులకు వినతిపత్రం ఇస్తే పరిష్కరిస్తాం అని చెప్పారు. ఎక్కడ ఏ వేదిక మీద ఎలా ప్రస్తావించాలో తెలుసుకోవాలని మంత్రి బుగ్గన హితవు పలికారు.
కాగా, నెల్లూరు రూరల్ సమస్యలపై కోటంరెడ్డి పోరుబాట మొదలు పెట్టిన కోటంరెడ్డి.. నిన్నటి వరకు నెల్లూరులోనే ఆందోళన చేశారు. అయితే, తాజాగా అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయిన నేపథ్యంలో సభ వేదికగా తన గళం విప్పుతున్నారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ కోటంరెడ్డి అసెంబ్లీకి వచ్చారు. తన నియోజకవర్గంలో సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అంతరాత్మ ప్రభోదానుసారo ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేస్తానన్నారు.
తాజావార్తలు
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
-
world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. ‘భోగి’ టీజర్ రిలీజ్
-
Electric Scooter Range Case: 85KM రేంజ్ అంటూ అమ్మారు.. వచ్చింది 16KM మాత్రమే! EV కంపెనీకి రూ.1.68 లక్షల షాక్
-
Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. అప్పుడే ధోనీ, గంగూలీ, యువరాజ్ సరసన ప్రిన్స్!
-
Fauzi : ప్రభాస్‌ను నమ్ముకుంటే.. కెరీర్ వేస్ట్ అవుతుందా ?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!