Site icon NTV Telugu

టీడీపీ శ్రేణులను అడవి పందులతో పోల్చిన మంత్రి వెల్లంపల్లి

టీడీపీ నేతలు సీఎం జగన్‌ పై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా విజయవాడలో వైసీపీ శ్రేణులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస రావు పాల్గొన్నారు. వైసీపీ కార్యకర్తలు పంజా సెంటర్ లో చంద్రబాబు ఫోటోను చెప్పలతో కొడుతూ వినూత్న రీతిలో నిరసనలు తెలిపారు. ఈ సందర్భందా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. చంద్రబాబు 40 ఇయర్స్ ఇండస్ట్రీ, 14 ఏళ్ళ ముఖ్యమంత్రి అని చెప్పుకోవడానికి సిగ్గులేదా అని అన్నారు.

చంద్రబాబు ఎలా‌ ముఖ్యమంత్రి అయ్యాడో అందరికి తెలుసునన్నారు. జగన్ మోహన్ రెడ్డి సైగ చేస్తే రాష్ట్రంలో ఒక్క టీడీపీ నేత తిరగలేడని వార్నింగ్ ఇచ్చారు. చెండాలపు మాటలు మాడ్లాడితే పడాలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైద్రాబాద్ లో చంద్రబాబుకి ఇంద్రా ప్యాలెస్ లేదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో చంద్రబాబు ఆశాంతి సృష్టించాలని చూస్తున్నారని ఆరోపించారు.

వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తే చంద్రబాబు, అతని తాబేదారులు తట్టుకోలేరన్నారు. గంజాయికి పేటెంట్ హక్కు చంద్రబాబుదే అని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి పై చంద్రబాబు, అతని అడవి పందులు మాట్లాడితే ఖబడ్దార్ అంటూ ధ్వజమెత్తారు. ప్రజలను ఇబ్బంది పెడితే చంద్రబాబును సైతం అరెస్ట్ చేస్తామన్నారు.

Exit mobile version