విశాఖే రాజధానిగా పరిపాలన కొనసాగుతుందని వైసీపీ ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా విశాఖకు ఫిఫ్ట్ అవుతున్నారు. ఈ మేరకు ఆయన గ్లోబల్ సమ్మిట్ వేదికగా ప్రకటించారు. రాజధానిగా విశాఖపట్నం ఖాయమని, పాలన సాగించడానికి అవసరమైన అన్ని వసతులు అక్కడ ఉన్నాయని వైఎస్సార్సీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. ఉగాది నుంచి విశాఖ కేంద్రంగా పాలన సాగుతుందన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఈ క్రమంలో సీదిరి అప్పలరాజు అప్పల రాజు కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నం రాజధానిగా త్వరలొనే ఏర్పడుతుంది అని ఆయన అన్నారు. విశాఖ రాజధాని చేయాలని గొప్ప పాలసీ సిఎం జగన్ తీసుకువచ్చారని తెలిపారు.
Also Read:5G Smart Phone: మోటరోలా నుంచి స్మార్ట్ ఫోన్.. ధర ఎంతంటే..
స్దానిక సంస్దలు , పట్టబద్రుల ఎమ్మెల్సీ ఓటు హాక్కును వినియోగించుకున్న మంత్రి సీదిరి అప్పలరాజు.. విపక్ష పార్టీపై ఫైర్ అయ్యారు. ప్రతిపక్షం దొంగ దిబ్బతీయాలనే కులాల పేరుతో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్దిగా ఇండిపెండెంట్ ను బరిలో ఉంచారని అన్నారు. కులాలు ఎగదోసి, పార్టీల వెనుకుండి , అసమానతలు రెచ్చకొట్టడం చంద్రబాబుకు వెన్నతోపెట్టిన విద్య అని ఆరోపించారు. ఈ ఎన్నిలతో అయినా బుద్ది తెచ్చుకోవాలన్నారు. గ్రాడ్యుయేట్స్ వైసిపి ఎమ్మెల్సీ అభ్యర్ది సీతంరాజు సుధాకర్ కు మద్దతుగా ఉండాలని కోరారు. తమ కులం వారే బాగుపడాలని లక్ష్యంతో అమరావతి రాజధాని కావాలంటూ టీడీపీ కోర్టుకు వెళ్లిందని మండిపడ్డారు. చంద్రబాబు వైఖరిని గ్రాడ్యుయేట్స్ గ్రహించాలన్నారు. గెలవటానికి టిడిపి పోటీచేయటం లేదని, వైసీపీ అభ్యర్థిని ఓడించాలని కుమ్మక్కు రాజకీయాలకు తెరతీసారని ధ్వజమెత్తారు.రెండవ ప్రాధాన్యత విశయంలో ఇతరపార్టీలతో టిడిపి కమ్మక్కుఅయిందని మంత్రి అప్పలరాజు ఆరోపించారు. చంద్రబాబు ఎన్నికలు వస్తే నక్కజిత్తులు చేస్తారని ఘాటుగా వ్యాఖ్యానించారు. జిల్లాలో పొలింగ్ ఉత్సాహంగా కొనసాగుతుందన్న మంత్రి.. వైసిపి శ్రేణులు ఒటర్లను ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు గ్రామాల నుంచి తరలిస్తున్నారని తెలిపారు.
Also Read:Dadisetti Raja: ఆర్ఆర్ఆర్‌కు వచ్చిన ఆస్కార్ కంటే పవన్ యాక్టింగ్ ఎక్కువ..! మంత్రి ఫైర్
కాగా, ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ప్రకాశం జిల్లా పొదిలి పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత చోటుచేసుంది. మార్కాపురం ఎమ్మెల్యే నాగార్జునరెడ్డిని టీడీపీ నేతలు అడ్డుకున్నారు. అనుచరులతో కలిసి పోలింగ్ కేంద్రంలోకి వెళ్తుండగా అడ్డగించారు. ఒంగోలు సెయింట్ థెరీసా కేంద్రం వద్ద వైసీపీ, టీడీపీ కార్యకర్తల వివాదం నెలకొంది. ఎమ్మెల్యే బాలినేని, మాజీ ఎమ్మెల్యే దామచర్ల రాకతో ఉద్రిక్తత చోటు చేసుకుంది.ఎన్టీఆర్ భవన్‌లో పార్టీ సీనియర్ నేతలతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సరళిపై చర్చించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బాలినేని వైఖరిపై ప్రకాశం ఎస్పీకి చంద్రబాబు ఫోన్ చేశారు. వైసీపీ నేతలపై పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని ఫిర్యాదు చేశారు. బాలినేనిపై చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.