తెలంగాణ రాష్ట్రం ధాన్యం కొనుగోలు విషయంలో అగ్గి రాజుకుంటోంది. అధికార టీఆర్‌ఎస్ పార్టీ, బీజేపీ ల మధ్య ధాన్యం కొనుగోళ్లలో రాజకీయం వేడెక్కింది. ఈ నేపథ్యంలో తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ నేతలు డ్రామాలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైతులు పంటలు పండించుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం నీళ్లు, కరెంటు ఇస్తూంటే.. ఇప్పడొచ్చి బీజేపీ నేతలు వరి కొనుగోలు చేయాలంటూ కొనుగోలు కేంద్రాల వద్దకు వెళ్లడం హాస్యస్పదం అన్నారు. అంతేకాకుండా రైతుల సమస్యల గురించి ప్రధాని నరేంద్ర మోడీ ఒక్కసారైనా మాట్లాడారా..? అని ప్రశ్నించారు.