ఈమధ్యే బీజేపీలో చేరిన తీన్మార్ మల్లన్నపై బంజారాహిల్స్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు మంత్రి కేటీఆర్. తన కొడుకు హిమాన్షుపై తీన్మార్ మల్లన్న ట్వీట్ చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో బంజారా హిల్స్ ఏసీపీకి టీఆర్ఎస్ సోషల్ మీడియా టీం ఫిర్యాదు చేసింది. కేటీఆర్ కొడుకు హిమాన్షుపై ట్విటర్లో పెట్టిన పోస్టుకు కోపంతో ఊగిపోయిన కొంతమంది టీఆర్ఎస్ సానుభూతిపరులు తీన్మార్ మల్లన్నపై దాడికి పాల్పడ్డారు.
మల్లన్న ట్వీట్‌ను మంత్రి కేటీఆర్ ఖండించారు. బీజేపీ మీడియా నాయకులు తన పిల్లలపై చాలా నీచమైన వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. వాక్ స్వాతంత్రం ఉందని.. భావవ్యక్తీకరణ పేరుతో ఇతరులపై ఇష్టమొచ్చినట్లు కామెంట్లు చేయడం మంచిది కాదన్నారు. తాము చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని కేటీఆర్ హెచ్చరించారు. మల్లన్న తన యూట్యూబ్ ఛానెల్లో హిమాన్షు ని కించపరిచేలా పోల్ పెట్టిన సంగతి తెలిసిందే. దీనిపై ఎమ్మెల్సీ కవిత కూడా తీవ్రంగా స్పందించారు.