మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా.. జాతీయ రోడ్డు రవాణా, రహదారుల శాఖ కార్యదర్శి అనురాగ్ జైన్తో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమావేశమయ్యారు. ఆర్ఆర్ఆర్ రోడ్డు నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అనురాగ్ జైన్కు మంత్రి తెలిపారు. అలాగే.. నల్గొండ బైపాస్ రోడ్డు నిర్మాణాన్ని త్వరగా చేపట్టేందుకు ఎస్ఎఫ్సీ (స్టాండింగ్ ఫైనాన్స్ కమిటీ) మీటింగ్ ఏర్పాటు చేసి త్వరగా టెండర్లు పిలవాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కోరారు.
Read Also: Harish Rao: గ్రామ పంచాయతీల పట్ల ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోంది..
అంతేకాకుండా.. రాష్ట్రంలో 16 రాష్ట్ర రహదారులను.. జాతీయ రహదారులుగా మార్చే ప్రతిపాదనలపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని మంత్రి అనురాగ్ జైన్కు అభ్యర్ధించారు. ఈ సమావేశంలో మంత్రితో పాటు ఆర్&బీ స్పెషల్ సెక్రెటరీ దాసరి హరిచందన, ఇతర అధికారులు పాల్గొన్నారు. రహదారుల నిర్మాణాలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సెక్రటరీతో కులంకుషంగా చర్చించారు. నల్గొండ బైపాస్ నిర్మాణంపై వారంలో ఎస్ఎఫ్సీ ఏర్పాటు చేస్తామని అనురాగ్ జైన్ హామీ ఇచ్చారు.
Read Also: Deputy CM Pawan Kalyan: ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ సంచలన వ్యాఖ్యలు