NTV Telugu Site icon

Minister Kakani: సెల్ఫీ సవాల్‌కు మేము సిద్ధం.. టీడీపీకి మంత్రి కాకాణి కౌంటర్

Kakani Govardhan Reddy

Kakani Govardhan Reddy

ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ వైసీపీ ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం సాగుతుంది. ఇరుపార్టీల నేతలు ఒకరిపైమరొకరు సవాళ్లు ప్రతిసవాళ్లు విసురుకుంటున్నారు. చంద్రబాబు విసిరిన సెల్ఫీ సవాల్‌పై వైసీపీ తీవ్రంగా స్పందించింది. తెలుగుదేశం పార్టీ నేతలకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. సెల్ఫీ సవాల్‌కు తాము సిద్ధమని ప్రకటించారు. ప్రతిపక్ష పార్టీల నేతలు పని గట్టుకుని ప్రభుత్వం పై దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. రాష్ట్రంలో వ్యవసాయాభివృద్ధి జాతీయ స్థాయి కంటే ఎక్కువగా వుందన్నారు. చంద్రబాబు హయాంలో వేలాది ఎకరాల్లో పంట వేసినా..నీరులేక ఎండిపోయాయని గుర్తు చేశారు. పౌల్ట్రీ రంగంలో ముందంజలో ఉన్నామన్నారు.
Also Read: Kiran Kumar Reddy: మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి కీలక బాధ్యతలు.. జాతీయ కార్యదర్శి పదవి?!

చంద్రబాబు హయాంలో 16 వందల మండలాలను కరువు మండలాలుగా ప్రకటించారని మంత్రి కాకాణి గుర్తు చేశారు. జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒక కరువు మండలం కూడా లేదన్నారు. వర్షాలు సంవృద్దిగా కురుస్తున్నాయని తెలిపారు. చంద్రబాబు వచ్చి వైసిపి నేతలను తిట్టి వెళ్లారని ధ్వజమెత్తారు. సెల్ఫీ సవాల్ కు మేము సిద్ధం..దమ్ముంటే ప్రజల్లోకి రావాలి అని మంత్రి కాకాణి సవాల్ విసిరారు. కార్యకర్తలు, నేతలు కష్ట పడితే అధికారం అనుభవించాలని అనుకుంటున్నారని విమర్శించారు. రైతులు పండించిన ధాన్యానికి మంచి ధర వస్తోందన్నారు. దీన్ని చూసి మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తట్టుకోలేక పోతున్నారని ఎద్దేవా చేశారు. ధాన్యం ధరలపై దమ్ముంటే చర్చకు రావాలని చంద్రమోహన్ రెడ్డికి సవాల్ విసిరారు. టిడిపి నెల్లూరులో బలహీనంగా ఉందని చంద్రబాబు స్వయంగా చెప్పారని మంత్రి కాకాణి తెలిపారు. ప్రజలకు సేవ చేయకుండా మీడియా ద్వారా వ్యతిరేకత తీసుకు వచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబును నమ్మలేమని ఆ పార్టీ నేతలే చెబుతున్నారని మంత్రి కాకాణి సెటైర్లు వేశారు.
Also Read:NTR: ఆ నట సార్వభౌముడి విలనిజానికి 100 కోట్లా?

కాగా, ఏపీ సీఎం జగన్‌కి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సెల్ఫీ సవాల్‌ విసిరారు. నెల్లూరులో టిడ్కో కాలనీ ముందు ఫోటోలు దిగిన చంద్రబాబు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. గత ప్రభుత్వంలో పేదల కోసం కట్టిన వేలాది ఇళ్లు ఇవి…రాష్ట్రంలో నాడు నిర్మించిన లక్షల టిడ్కో ఇళ్లకు సజీవ సాక్ష్యాలని చెప్పారు. మరి నాలుగేళ్లలో మీరు నిర్మించిన పేదల ఇళ్లు ఎన్నో లెక్క చెప్పగలరా.. అసలు మీరు కట్టిన ఇళ్లెన్నో చూపించగలరా సీఎం జగన్‌కు చంద్రబాబు చంద్రబాబు సవాల్ విసిరారు. ఈ క్రమంలో వైసీపీ నేతలు స్పందించారు.

Show comments