ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తుండడంతో రాజకీయ పార్టీలు వ్యూహాలతో ముందుకు సాగుతున్నాయి. ఈ క్రమంలో కాపు, బీసీ ఓట్లపై ప్రధానంగా దృష్టి సారించాయి. నిన్న బీసీ సదస్సులో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొని మాట్లాడారు. అన్ని బీసీ కులాలు కలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యాధికారం ఇంకెవ్వరికీ దక్కదన్నారు. ఇన్నేళ్లుగా బీసీల సమైక్యత ఎందుకు సాధ్యం కాలేదో ఇప్పటికీ అర్థం కావట్లేదని వ్యాఖ్యానించారు. అయితే, పవన్ బీసీ సదస్సుపై మంత్రి జోగి రమేష్ కౌంటర్ ఇచ్చారు.
Also Read: AP Budget Session: ఏపీ బడ్జెట్ 2.6 లక్షల కోట్లు.. కేటాయింపులు భారీగా ఉంటాయా?
పవన్ కల్యాణ్ పదేళ్ళలో బీసీల కోసం ఏమి మాట్లాడారని ప్రశ్నించారు. అసలు పవన్ భావజాలంలోనే బీసీలు లేరన్నారు. బీసీలకు పవన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 125 హామీలిచ్చి, మ్యానిఫెస్టోలో పెట్టి అన్నీ తుంగలో తొక్కారని విమర్శించారు. పవన్ కల్యాణ్‌కు బీసీలపై ప్రేమ, అభిమానం ఉంటే తన ఛాలెంజ్ స్వీకరించాలని సవాల్ విసిరారు. జనసేన ఆవిర్భావ సభ రోజు చర్చిద్దాం అని చెప్పారు. సామాజిక న్యాయం ఎవరితో సాధ్యం అయ్యిందో చర్చకు పవన్ సిద్ధమా? అని సవాల్ విసిరారు. పవన్ దృష్టిలో బీసీ అంటే బాబు క్లాస్ అని అన్నాు. బీసీలకు డిక్లరేషన్ చెయాలంటే 175 స్థానాల్లో పోటీ చెయాలని సూచించారు.
చంద్రబాబుకు అమ్ముడు పోయిన పవన్ బీసీల డిక్లరేషన్ ఎలా చేస్తాడు? అని మంత్రి జోగి రమేష్ ప్రశ్నించారు.
Also Read: MLC Elections: దొంగ ఓట్ల రాజ్యం.. ఉద్యోగులకు జీతాలు ఇవ్వరు.. కానీ..
కాగా, బీసీ సదస్సులో వపన్ మాట్లాడుతూ.. బీసీలు వారు రాజ్యాధికారాన్ని అర్థించటం కాదు.. పోరాడి సాధించుకోవాలని పిలుపునిచ్చారు. గతంలో 93 ఉన్న బీసీ కులాలు ఇప్పుడు 140కి ఎందుకు పెరిగాయని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. చట్టసభల్లో సంఖ్యా బలం లేని బీసీలకు ఏం చేయగలం అనే దానిపై ఆలోచిస్తానని వెల్లడించారు. మీ ఓట్లే మీకు పడవని బీసీలను హేళన చేస్తున్నారని పవన్ తెలిపారు. బీసీ అభ్యర్థిని నిలబెట్టినప్పుడు అందరూ ఏకతాటిపైకి రావాలన్నారు. తనను ఒక కులానికి పరిమితం చేసి బీసీ నాయకులతో తిట్టిస్తున్నారని చెప్పారు.
Also Read: Viveka Murder Case: అరెస్టు చేసుకోండి.. అన్నింటికి సిద్ధమేనన్న భాస్కర్ రెడ్డి
మరోవైపు ఎన్నికల వ్యూహాంలోనే భాగంగానే పవన్ బీసీ సదస్సు నిర్వహించారని తెలుస్తోంది. కాపులతోపాటు బీసీ వర్గాలను జనసేనకు దగ్గర చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, ఇప్పటి వరకు జరిగిన ఎన్నికలు చూసుకుంటే.. బీసీల మద్దతు ఉన్నవారికి కాపుల మద్దతు కష్టమే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాపుల మద్దతు ఉన్నవారికి బీసీల మద్దతు కష్టమే అనే అభిప్రాయం ఉంది. ముఖ్యంగా కాపులు దూరం అయ్యారని తెలిస్తే.. ఆయా పార్టీలను బీసీలను దగ్గరకు చేర్చుకునే ప్రయత్నం చేస్తాయి. కానీ పవన్ మాత్రం రెండు సామాజిక వర్గాలకు దగ్గర అవ్వాలని ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ నుంచి మాటల దాడి మొదలైనట్లు తెలుస్తోంది.