ప్రపంచవ్యాప్తంగా కరోనా, ఒమిక్రాన్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. కరోనా మహమ్మారికి ర్యాపిడ్ టెస్ట్ కిట్లు అందుబాటులో ఉన్నాయి. కరోనా ఉన్నదా లేదా అన్నది ఖచ్చితంగా తెలుసుకోవడానికి ఆర్టీపీసీఆర్, ర్యాపిడ్ పీసీఆర్ టెస్టులు చేస్తున్నారు. అయితే, కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ను గుర్తించడానికి ప్రత్యేకమైన కిట్స్ ఇంకా అందుబాటులోకి రాలేదు. కోవిడ్ టెస్టుల్లో పాజిటివ్‌గా నిర్ధారణ జరిగిన తరువాత జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపి ఒమిక్రాన్ ఉన్నదా లేదా అని నిర్ధారించుకోవాలి. ఇదిలా ఉంటే, సైబర్ నేరగాళ్లు ఒమిక్రాన్ వేరియంట్‌కు ఉచితంగా టెస్టులు నిర్వహిస్తామని కేంద్రం ప్రభుత్వం పేరుతో లింకులు క్రియోట్ చేసి మెయిల్స్‌కు పంపుతున్నారు.
Read: మూడో ఏట అడుగుపెట్టిన కరోనా… కలిసికట్టుగా ఎదుర్కొంటేనే…
ఉచిత చికిత్స అని నమ్మి లింక్‌పై క్లిక్ చేస్తే, వినియోగదారులకు సంబంధించిన పర్సనల్ డేటాను సైబర్ నేరగాళ్లు తస్కరిస్తున్నారు. కేంద్రం ఇప్పటి వరకు ఒమిక్రాన్ చికత్సకు సంబంధించి ఎలాంటి ఉచిత ప్రకటనలు ఇవ్వలేదని, క్లిక్ చేసేముందు యూఆర్ఎల్‌ను చూసుకోవాలని, లేదంటే పర్సనల్ డేటా మొత్తం సైబర్ నేరగాళ్ల పాలవుతుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు.