మ‌ళ్లీ ప‌ట్టు సాధించిన పుతిన్ వ‌ర్గం: ఎన్నిక‌ల్లో ఆ పార్టీదే ఘ‌న‌విజ‌యం…

ర‌ష్యాలోని దిగువ స‌భ డ్యూమాకు ఇటీవ‌లే ఎన్నిక‌లు జ‌రిగాయి.  ఈ ఎన్నిక‌ల‌కు సంబందించిన ఫ‌లితాలు పుతిన్ పార్టీకి అనుకూలంగా రావ‌డంతో ఆ పార్టీ సంబ‌రాలు చేసుకుంటోంది.  దిగువ స‌భ డ్యూమాలో 450 స్థానాలు ఉండ‌గా, అందులో దామాషా పద్ద‌తిప్ర‌కారం 225 స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ్గా అందులో 198 స్థానాల్లో ఇప్ప‌టికే పుతిన్ పార్టీ యునైటెడ్ ర‌ష్యా ఆధిక్యంలో ఉన్న‌ది.  యునైటెడ్ ర‌ష్యా పార్టీ 49.8 శాతం ఓట్ల‌ను సాధించింది. కాగా, ప్ర‌త్య‌ర్థ పార్టీ ర‌ష్యా కమ్యునిస్ట్ కేవ‌లం 19శాతం ఓట్ల‌కే ప‌రిమితం అయింది.  ఎగువ‌, దిగువ స‌భల్లో యునైటెడ్ ర‌ష్యా పార్టీకి స్ప‌ష్ట‌మైన మెజారిటీ రావ‌డంతో పుతిన్‌కు అనుకూలంగా రాజ్యాంగాన్ని మార్చేందుకు అన్ని రాకాలుగా మార్గం సుగుమం అయింది.  2024లో రష్యా అధ్య‌క్షుడిగా పుతిన్ పోటీపై ఇంకా క్లారిటీ ఇవ్వ‌లేదు.  రష్యాకు జీవిత‌కాలం పాటు పుతిన్ ప్ర‌క‌టించుకునే అవ‌కాశం కూడా ఉన్న‌ట్టు నిపుణులు చెబుతున్నారు.  ర‌ష్యాపై పుతిన్ కు ఉన్న ప‌ట్టు ఈ ఎన్నిక‌ల‌తో మ‌రోసారి రుజువైంది.  ర‌ష్యా అంటే పుతిన్ అని, పుతిన్ అంటే ర‌ష్యా అనే విధంగా తన ప్రాభ‌ల్యాన్ని పెంచుకున్నాడు పుతిన్‌.  

Read: బెంగాల్ బీజేపీ చీఫ్‌గా సుకంత‌… దిలీప్ ఘోష్‌కు ప్ర‌మోష‌న్‌…!!

-Advertisement-మ‌ళ్లీ ప‌ట్టు సాధించిన పుతిన్ వ‌ర్గం:  ఎన్నిక‌ల్లో ఆ పార్టీదే ఘ‌న‌విజ‌యం...

Related Articles

Latest Articles