ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఒక గ్రామంలో 16 ఏళ్ల క్రితం 11 మంది గిరిజన మహిళలపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన 21 మంది పోలీసులను ప్రత్యేక కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయడంలో ఇద్దరు దర్యాప్తు అధికారులు విఫలమైనందున నిందితులను ప్రాథమికంగా నిర్దోషులుగా విడుదల చేసినట్లు కోర్టు పేర్కొంది.
Also Read:Accused Of Gang Raping: అత్యాచారం కేసులో 21 మంది పోలీసులు.. నిర్దోషులుగా విడుదల
వాకపల్లి మహిళలపై పోలీసులు జరిపిన అత్యాచార కేసులో కోర్టు తీర్పుపై మావోయిస్టు పార్టీ స్పందించింది. అత్యాచారం చేసిన పోలీసులను నిర్దోషులుగా ప్రకటిస్తూ ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ ఉద్యమించాలని పిలుపునిచ్చింది. భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు)ఆంధ్ర-ఒడిశా బార్డర్ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి గణేష్ పేరిట లేఖ విడుదల చేసింది. వాకపల్లిలో 11 మంది ఆదివాసీ మహిళలపై పోలీసులు సామూహిక అత్యాచారం జరిగి 16 సంవత్సరాలు కావస్తున్నది.
Also Read:Droupadi Murmu: సుఖోయ్‌లో ప్రయాణించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..
ఈ ఘటనపై నియమించిన విచారణ కమిషన్ అధికారులలో ఒకరు చనిపోయారు. మరొకరు సరైన విచారణ నివేదికను ఇవ్వలేకపోయారు.కనుక అత్యాచారానికి పాల్పడ్డ పోలీసులు నిర్ధోషులు అని కోర్టు ప్రకటించింది. ఈ తీర్పు ద్వారా రాజ్యం తన వర్గస్వభావాన్ని మరొకసారి బహిర్గతపర్చుకుంది. ఈ వ్యవస్థలో నిరుపేదలైన ఆదివాసీలకు, ముఖ్యంగా మహిళలకు న్యాయం జరగదని మరోసారి రుజువైంది అని లేఖలో మావోయిస్టు పార్టీ ఆంధ్ర-ఒడిశా బార్డర్ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి గణేష్ పేర్కొన్నారు.
