ఎవరి జీవితం ఎప్పుడు ఎలా మారిపోతుందో చెప్పలేం. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌కు చెందని ఓ వ్యక్తి 2015లో స్థానికంగా ఉన్న ఓ పార్క్‌లో వాకింగ్ చేస్తుండగా ఓ రాయి కనిపించింది. అది చూసేందుకు విచిత్రంగా అనిపించింది. వెంటనే దాన్ని ఇంటికి తీసుకెళ్లాడు. ఇంట్లోనే చాలా కాలం ఉంచుకున్నాడు. సుమారు 17 కేజీల రాయి కావడంతో దానిని చిన్న చిన్న ముక్కలుగా చేసి వినియోగించుకోవాలని అనుకున్నాడు. రాయిని సుత్తితో పగలగొట్టేందుకు ప్రయత్నించాడు. సాధ్యం కాకపోవడంతో డ్రిల్లింగ్ మిషన్ వినియోగించేందుకు ప్రయత్నించారు. అయినా, రాయి పగలలేదు. అనుమానం వచ్చిన ఆ వ్యక్తి రాయిని స్థానిక మ్యూజియానికి తీసుకెళ్లి పరీక్ష చేయించాడు. ఆ రాయిని పరీక్షించిన జియాలజిస్టులు షాక్ అయ్యారు.
Read: ఉడిపిలో అరుదైన చేప… వేలంలో భారీ ధరకు అమ్మకం…
ఆ రాయి సుమారు 460 కోట్ల సంవత్సాల క్రితం నాటిదని, అంతరిక్షం నుంచి భూమిపై పడిన ఉల్క అని, బంగారం కంటే ఆ రాయి ఎన్నో రెట్లు విలువైనదని చెప్పారు. దీంతో ఆ వ్యక్తి ఎగిరి గంతేశాడు. ఇక స్థానిక పార్కులో బంగారంతో పాటుగా విలువైన వస్తువులు దొరుకుతుంటాయి. పార్క్‌లో దొరికిన వస్తువులను సందర్శకులు ఇంటికి తీసుకెళ్లవచ్చు. ఇలానే డేవిడ్ పార్క్‌లో దొరికిన రాయిని తీసుకొని వెళ్లాడు. ఇప్పుడు ఆ రాయి బంగారం కంటే విలువైనదిగా మారడంతో డేవిడ్ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.