ఎవరి జీవితం ఎప్పుడు ఎలా మారిపోతుందో చెప్పలేం. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌కు చెందని ఓ వ్యక్తి 2015లో స్థానికంగా ఉన్న ఓ పార్క్‌లో వాకింగ్ చేస్తుండగా ఓ రాయి కనిపించింది. అది చూసేందుకు విచిత్రంగా అనిపించింది. వెంటనే దాన్ని ఇంటికి తీసుకెళ్లాడు. ఇంట్లోనే చాలా కాలం ఉంచుకున్నాడు. సుమారు 17 కేజీల రాయి కావడంతో దానిని చిన్న చిన్న ముక్కలుగా చేసి వినియోగించుకోవాలని అనుకున్నాడు. రాయిని సుత్తితో పగలగొట్టేందుకు ప్రయత్నించాడు. సాధ్యం కాకపోవడంతో డ్రిల్లింగ్ మిషన్ వినియోగించేందుకు ప్రయత్నించారు.…