ఉడిపిలో అరుదైన చేప‌… వేలంలో భారీ ధ‌ర‌కు అమ్మ‌కం…

అప్పుడ‌ప్పుడు మ‌త్స్య‌కారుల వ‌ల‌కు అరుదైన చేప‌లు దొరుకుతుంటాయి.  అలా దొరికిన వాటిని వేలంలో భారీ ధ‌ర‌ల‌కు విక్ర‌యిస్తుంటారు.  ఇలానే, క‌ర్ణాట‌క‌లోని ఉడిపిలో మ‌త్స్య‌కారుని వ‌ల‌కు అరుదైన ఘోల్ ఫిష్ చిక్కింది.  ఈ ర‌క‌మైన చేప‌ల‌కు బ‌హిరంగ మార్కెట్‌లో భారీ ధ‌ర ఉంటుంది.  పెద్ద మొత్తంలో చెల్లించి వీటిని కొనుగోలు చేస్తుంటారు.  ఈర‌క‌మైన చేప‌ల్లో ఔష‌ద‌గుణాలు అధికంగా ఉంటాయి.  మెడిస‌న్ రంగంలో వీటిని వినియోగిస్తుంటారు.  

Read: జ‌రభ‌ద్రం: ఆ వైర‌స్ గాలిలో మూడు మీట‌ర్ల‌కు మించి ప్రయాణం చేయ‌గ‌ల‌దు…

ఉడిపిలో మ‌త్స్య‌కారునికి 18 కిలోల బ‌రువైన ఘోల్ ఫిష్ దొరికింది.  వ‌ల‌కు చిక్కిన ఈ చేప‌ను మాల్పే ఓడ‌రేవుకు తీసుకొచ్చి వేలం వేశారు.  అరుదైన చేప కావ‌డంతో కిలోకి 10 వేల చొప్పున 18 కిలోల చేప‌ను రూ.1.80 ల‌క్ష‌లకు అమ్మారు.  సాధార‌ణంగా ఘోల్ చేప‌ల మాంసం చాలా బ‌ల‌మైన ఆహారం అని, ఈ ర‌క‌మైన చేప‌లు కిలో 9 నుంచి 10 వేల వ‌ర‌కు ప‌లుకుతుంద‌ని మ‌త్స్య‌కారులు చెబుతున్నారు. చాలా కాలంగా తాను స‌ముద్రంలో చేప‌ల వేట‌కు వెళ్తున్నాన‌ని, కానీ, ఇలాంటి అరుదైన చేప‌లు వ‌ల‌కు చిక్క‌డం ఇదే మొద‌టిసారి అని మ‌త్స్య‌కారుడు చెప్పుకొచ్చాడు.  

Related Articles

Latest Articles