పద పదవే గాలిపటమా… అనే పాట గుర్తుంది కదా… మన దగ్గర సంక్రాంతి వస్తే గాలిపటాలు ఎగరవేస్తుంటారు. గాలిపటాల పందేలు నిర్వహిస్తుంటారు. దీనికోసం పెద్ద ఎత్తున గాలిపటాలు తయారు చేస్తుంటారు. గాలిపటాల వేడుకలు మనదగ్గరే కాదు, శ్రీలంకలోనూ ఘనంగా నిర్వహిస్తుంటారు. శ్రీలంకలో తై పొంగల్ వేడుకల్లో గాలిపటాలు ఎగరవేయడం ఆనవాయితి. అక్కడ గాలిపటాల పందేలను పెద్ద ఎత్తున నిర్వహిస్తుంటారు. పోటీల్లో పాల్గొనే ఔత్సాహికులు వివిధ ఆకృతుల్లో గాలిపటాలు తయారు చేసి ఎగరవేస్తుంటారు.
Read: యూపీలో కొత్త టెన్షన్… అఖిలేష్ భార్యకు కరోనా పాజిటివ్…
జాఫ్నాలో అకైట్ ఫ్లైయింగ్ గేమ్‌ను పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ వేడుకల్లో గాలి పటాలు ఎగరవేసేందుకు ఔత్సాహికులు హాజరయ్యారు. అయితే, ఓ వ్యక్తి జనపనారతో తాడును, పెద్ద గాలిపటాన్ని తయారు చేసి మెల్లిగా దానిని వదిలారు. ఆరుగురు సభ్యులు తాడును మెల్లిగా వదలగా, ఓ వ్యక్తి మాత్రం తాడు మొత్తాన్ని వదిలేశాడు. దీంతో తాడుతో పాటు ఆ వ్యక్తి గాల్లోకి ఎగిరిపోయాడు. కొన్ని నిమిషాలు తాడుతో పాడు గాల్లోనే ఉండిపోయాడు. కింద ఉన్న వ్యక్తులు పెద్దగా కేకలు వేసి తాడును వదిలేయాని చెప్పడంతో చివరకు తాడును వదిలేసి కిందపడిపోయాడు. అదృష్టవశాత్తు అతనికి గాయాలేమి కాలేదు.