NTV Telugu Site icon

వీడు మాములోడు కాదు…విమానం ల్యాండింగ్‌ గేర్‌లో దాక్కొని…

విమానాల్లో ప్ర‌యాణం చేయాలి అంటే టికెట్ కొనుగోలు చేసి త‌ప్ప‌ని ప్ర‌యాణం చేయాలి.  రైళ్ల‌లో మాదిరిగా బాత్‌రూమ్‌ల‌లో, టీసీల‌కు క‌నిపించ‌కుండా దాక్కోని ప్ర‌యాణం చేయ‌డం కుద‌ర‌ని ప‌ని.  కానీ, ఓ వ్య‌క్తి టికెట్ లేకండా, ఎయిర్‌పోర్ట్ అధికారుల క‌ళ్లుగ‌ప్పి 1640 కిలోమీట‌ర్లు విమానంలో ప్ర‌యాణించాడు.  విమానం ల్యాండింగ్ అయ్యాక ఆ వ్య‌క్తి బ‌య‌ట‌కు వ‌చ్చిన తీరు చూసి విమాన గ్రౌండ్ సిబ్బంది షాక్ అయ్యారు.  

Read: షేర్ మార్కెట్‌పై క‌నిపించ‌ని ఒమిక్రాన్ ప్ర‌భావం… లాభాల‌తో…

విమానం ల్యాండింగ్ గేర్ బాక్స్ లోప‌న కూర్చోని గ్వాటెమాలా సిటీ నుంచి మియామీకి వ‌చ్చాడు.  సుమారు 1640 కిలోమీట‌ర్ల దూరం, నాలుగైదు గంట‌ల ప్ర‌యాణం.  ఇంత ల్యాండింగ్ గేర్ బాక్సులో ఎలా కూర్చోని వ‌చ్చాడో ఎవ‌రికీ అర్థం కాలేదు.  వెంట‌నే ఎయిర్‌పోర్ట్ అధికారులు ఆ వ్య‌క్తిని అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌గా వైర‌ల్‌గా మారింది.  

వీడియో కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి