షేర్ మార్కెట్‌పై క‌నిపించ‌ని ఒమిక్రాన్ ప్ర‌భావం… లాభాల‌తో…

ప్ర‌పంచం మొత్తాన్ని ఒమిక్రాన్ వేరియంట్ వ‌ణికిస్తున్న సంగ‌తి తెలిసిందే.  ఒమిక్రాన్ వేరియంట్ కార‌ణంగా ప్ర‌పంచ దేశాల ఆర్థిక ప‌రిస్థితి మ‌ళ్లీ మొద‌టికి వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్న నేప‌థ్యంలో ఈరోజు ఉద‌యం స్టాక్ మార్కెట్ సూచీలు కొంత ఆందోళ‌న క‌లిగించాయి.  స్టాక్ మార్కెట్ ఒడిదుడుకుల‌కు లోన‌య్యాయి.  అయితే, ఇది కేవ‌లం అర‌గంట మాత్ర‌మే అని స్ప‌ష్టమ‌యింది.  కోనుగోళ్ల తాకిడి పెర‌గ‌డంతో సూచీలు భారీగా పుంజుకున్నాయి.  రిల‌య‌న్స్ టారిఫ్ ధ‌ర‌లు పెంచ‌డం, ప్రైవేట్ బ్యాంకుల్లో ప్ర‌మోట‌ర్ల వాటాపై ఆర్బీఐ సానుకూల ప్ర‌తిపాద‌న‌లు, ముడి చ‌మురు ధ‌ర త‌గ్గ‌డం వంటి పరిణామాలు స్టాక్ మార్కెట్ లాభ‌ప‌డ‌టానికి అనుకూలంగా నిలిచాయి.  

Read: ఒమిక్రాన్‌పై హై అలర్ట్… సీఎం జగన్ కీలక ఆదేశాలు

అంతేకాదు, ఒమిక్రాన్ వేరియంట్ ఐరోపా దేశాల‌పై అధిక ప్ర‌భావం చూపుతున్న నేప‌థ్యంలో కూడా యూర‌ప్ స్టాక్ మార్కెట్లు లాభాల‌తో ప్రారంభం కావ‌డం కూడా దేశీయ మార్కెట్లు పుంజుకోవ‌డానికి దోహ‌ద‌ప‌డింది.  ఉద‌యం సెన్సెక్స్ 57,028.04 పాయింట్ల వ‌ద్ద న‌ష్టాల‌తో ప్రారంభ‌మ‌యింది.  మొద‌టి అర‌గంట త‌రువాత షేర్లు పుంజుకోవ‌డంతో సెన్సెన్స్ గ‌రిష్టంగా 57,626.51 కు చేరుకుంది.  చివ‌ర‌కు 153.43 పాయింట్ల లాభంతో 57,260.58 వ‌ద్ద ముగిసింది.  ఇక నిష్టి కూడా 27.50 పాయింట్ల లాభంతో 17,053.95 వ‌ద్ద ముగిసింది.  సెన్సెక్స్‌లో మొత్తం 18 షేర్లు లాభాల బాట ప‌ట్టాయి.  

Related Articles

Latest Articles