దీపావళి రోజున అనేక కంపెనీలు ఆఫర్లు ఇస్తుంటాయి. ముఖ్యంగా ఫుడ్ యాప్స్ అనేక ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. పండుగ రోజున కూడా ఫుడ్ డెలివరీ బాయ్స్ విశ్రాంతి లేకుండా పనులు చేస్తుంటారు. వారి శ్రమను గుర్తిస్తూ చిరాగ్ భర్జాత్యా అనే ట్విట్టర్ యూజర్ వినూత్నమైన ఆఫర్‌ను ప్రకటించారు. దీపావళి నుంచి నాలుగు రోజులపాటు తన ఇంటికి వచ్చే డెలివరీ బాయ్స్‌కి స్వీట్ ప్యాకెట్స్ ఫ్రీగా ఇస్తానని ప్రకటించారు.
Read: 130 కోట్ల భారతీయుల ప్రతినిధిగా వచ్చా- ప్రధాని మోడీ
ఈ విషయాన్ని ట్విట్టర్‌లో తెలిపారు. జోమాటో యాప్ నుంచి కొనుగోలు చేసిన స్వీట్ బాక్సులను ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ ఈ విషయాన్ని తెలిపారు చిరాగ్. అందరూ పండుగ సమయంలో ఇంట్లో ఉండి ఎంజాయ్ చేస్తుంటే డెలివరీ బాయ్స్ మాత్రం నిరంతరంగా పనిచేస్తుంటారని వారి కష్టాన్ని గమనించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు చిరాగ్ పేర్కొన్నారు.