ఇంట్లో దోమలు అధికంగా ఉంటే వాటి నుంచి రక్షణ పొందేందుకు మస్కిటో కాయిల్స్ వాడతుంటారు. మస్కిటో కాయిల్స్ నుంచి వచ్చే పొగతో దోమలు పారిపోతాయి. పొలాల్లోని కలుగుల్లో కూడా అప్పుడప్పుడు రైతులు పొగ పెడుతుంటారు. ఎందుకలంటే కలుగుల్లో దాక్కున్న ఎలుకలు, పాములు ఉంటే పారిపోతాయని. పంటను పాడుచేసే చీడపీడల నుంచి కూడా పొగతో రక్షణ కలుగుతుంది. ఇదే ఉపాయంతో ఓ వ్యక్తి తన ఇంట్లోని పాములను బయటకు పంపేందుకు బొగ్గును తీసుకొచ్చి పొగ పెట్టాడు. అయితే, ఆ బొగ్గునుంచి వచ్చి పొగ అధికంగా ఉండటంతో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి.
Read: చంద్రునిపై మిస్టరీ హౌస్…!!?
ఒక్కసారిగా మంటలు ఎగసిపడటంతో ఇల్లు మంటల్లో చిక్కుకుపోయింది. వెంటనే ఫైర్ సిబ్బందికి ఫోన్ సమాచారం అందించడంతో హుటాహుటిన ఫైర్ ఫైటర్స్ అక్కడికి వచ్చి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అప్పటికే ఇల్లు చాలా వరకు అగ్నికి ఆహుతైంది. దీనికి సంబంధించిన ఫొటోలను ఫైర్ సిబ్బంది ట్విట్టర్‌లో పోస్ట్ చేయగా వైరల్‌గా మారాయి. ఈ సంఘటన యూఎస్‌లోని మేరీలాండ్‌లో జరిగింది.