NTV Telugu Site icon

Hindu religious procession: హౌరాలో రామనవమి ర్యాలీ.. పిస్టల్‌తో వ్యక్తి హల్ చల్

Pistol In Ram Navami

Pistol In Ram Navami

శ్రీరామ నవమి వేడుకల్లో ఓ వ్యక్తి పిస్టల్ తో హల్ చల్ చేయడం కలకలం రేపింది. ఈ ఘటన పశ్చిమబెంగల్ లో జరిగింది. హౌరాలో రామనవమి ఊరేగింపు సందర్భంగా 22 ఏళ్ల యువకుడిని మంగళవారం పిస్టల్‌తో పట్టుకున్న వీడియో వైరల్ కావడంతో అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నిందితుడు సుమిత్ షా హౌరా జిల్లాలోని సాల్కియా ప్రాంత నివాసి. బీహార్‌లోని బంగల్మా జిల్లాలో ఉన్న అతని బంధువుల ఇంటి నుండి అతన్ని పట్టుకున్నారు. షా యొక్క వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అతను హిందూ మతపరమైన ఊరేగింపులో ఉత్సాహంతో తన పిస్టల్‌ని ఊపుతూ నృత్యం చేయడం చూడవచ్చు.

మార్చి 30న, హౌరా నగరంలో రామనవమి శోభా యాత్ర ఊరేగింపు చేపట్టినప్పుడు రెండు వర్గాల మధ్య హింస చెలరేగింది, అక్కడ అనేక వాహనాలు తగులబెట్టబడ్డాయి. దుకాణాలను ధ్వంసం చేశారు.

ఇదిలా ఉండగా, హౌరాలో రామనవమి ఊరేగింపు సందర్భంగా మతపరమైన ఉద్రిక్తతలను రేకెత్తించేందుకు ప్రయత్నించినందుకు బిజెపిని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిందించారు. ఈ సంఘటనలో పాల్గొన్న వారిని విడిచిపెట్టబోమని అన్నారు. హనుమాన్ జయంతిని జరుపుకునే గురువారం(ఏప్రిల్ 6) రాష్ట్రంలో మరో రౌండ్ హింసకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయని పేర్కొంది.

Also Read:Brutally Murdered: మాజీ ప్రియుడి హత్య.. మృతదేహాన్ని ముక్కలు చేసి పాతిపెట్టిన మహిళ