మోడీ పర్యటనలో భద్రతా లోపం… భటిండా ఫ్లైఓవర్‌పై ఆగిన కాన్వాయ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని నరేంద్ర మోడీ పంజాబ్ పర్యటనలో భద్రతా లోపం తలెత్తిందని కేంద్ర హోంశాఖ వెల్లడించింది. కొంతమంది నిరసనకారులు రోడ్డును అడ్డుకోవడంతో దాదాపు 20 నిమిషాల పాటు ప్రధాని మోదీ ఫ్లైఓవర్‌పై ఇరుక్కుపోయారని మంత్రిత్వ శాఖ ప్రకటనలో తెలిపింది. పంజాబ్‌లో బుధవారం జరగాల్సిన ప్రధాని నరేంద్ర మోదీ ర్యాలీ అనూహ్యంగా రద్దు అయింది. సభకు ప్రధాని మోదీ వెళ్లే మార్గంలో కొంతమంది నిరసనకారులు రోడ్డును దిగ్బంధించారు. దాంతో 20 నిమిషాలపాటు ఓ ఫ్లైఓవర్‌పైనే ఆగిపోయారు. అనంతరం ఢిల్లీకి తిరిగి వెళ్ళిపోయారు.
ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటనలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఫిరోజ్పుర్లో జరగాల్సిన సభ ఆకస్మికంగా రద్దయింది. పంజాబ్‌లో మోదీ అడుగుపెట్టినప్పటికీ.. సభకు హాజరు కాకుండానే తిరిగి ఆయన ఢిల్లీకి వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. కొన్ని కారణాల వల్ల సభకు మోదీ హాజరు కావడం లేదు” అని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయా.. సభా వేదికపై ప్రకటించారు. అయితే.. సరైన భద్రతా చర్యలు పాటించకపోవడం వల్లే సభకు మోదీ హాజరు కాలేకపోయారని కేంద్ర హోం శాఖ తెలిపింది.
Also Read
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Mumbai: ముంబై బస్ డిపోలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన బస్సులు
- Delhi: జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలో బిగ్ ట్విస్ట్.. పోలీస్ బాస్‌కు ప్రమోషన్
- British Airways: ఫ్లై దుబాయ్ తరహాలో బ్రిటిష్ విమానం నుంచి ఎమర్జెన్సీ కోడ్.. సర్వత్రా టెన్షన్
బఠిండా విమానాశ్రయానికి బుధవారం చేరుకున్న మోడీ హుస్సేనీవాలాలోని స్వాతంత్య్ర సమర యోధుల స్మారకం వద్ద నివాళి అర్పించేందుకు హెలికాప్టర్లో వెళ్లాలని భావించారు. అయితే.. వాతావరణం అనుకూలించలేదు. దీంతో రోడ్డుమార్గాన్ని ఎంచుకోవాల్సి వచ్చింది. రెండు గంటల పాటు ప్రయాణించేందుకు మోడీ రెడీ అయ్యారు. రోడ్డుమార్గంలో వెళ్లేందుకు తగిన భద్రతా ఏర్పాట్లు చేశామని పంజాబ్ డీజీపీ చెప్పారు. మోదీ కాన్వాయ్.. హుస్సేనీవాలాకు బయల్దేరింది. గమ్యస్థానానికి మరో 30 కిలోమీటర్ల దూరం ఉందనగా అనూహ్యంగా పరిణామం జరిగింది. కాన్వాయ్ ఓ ఫ్లైఓవర్‌పైకి చేరుకోగానే కొంతమంది నిరసనకారులు రోడ్డును దిగ్బంధించారు. ఫ్లైఓవర్‌పై 15 నుంచి 20 నిమిషాలపాటు మోదీ కాన్వాయ్అలాగే ఉండిపోయింది. భద్రతా పరమయిన లోపాల వల్లే ఇలా జరిగింది.
బటిండా విమానాశ్రయంలో ఉన్న పంజాబ్ ఉన్నతాధికారులతో పీఎం మోడీ మాట్లాడారు. ” మీ సీఎంకి ధన్యవాదాలు చెప్పండి… నేను బటిండా విమానాశ్రయం వరకు సజీవంగా తిరిగి రాగలిగాను.”అన్నారు. ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది.
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!