బొగ్గు కొర‌త ప్ర‌భావం: 13 విద్యుత్ ప్లాంట్లు మూసివేత‌…

దేశంలో బొగ్గు కొర‌త తీవ్రంగా ఉన్న సంగ‌తి తెలిసిందే.  బొగ్గు కొర‌త కార‌ణంగా విద్యుత్ ఉత్ప‌త్తి త‌గ్గిపోయింది.  మ‌రో ప‌ది రోజుల‌పాటు ఇలాంటి ప‌రిస్థితి కొన‌సాగ‌వ‌చ్చిన అధికారులు చెబుతున్నారు. అన్నిరాష్ట్రాలు బొగ్గుకొర‌త‌ను ఎదుర్కొంటున్నాయి.  మ‌హారాష్ట్ర‌లో ఈ ప‌రిస్థితి మ‌రింత ఎక్కువ‌గా ఉన్న‌ది.  బొగ్గు కొర‌త కార‌ణంగా రాష్ట్రంలో 13 విద్యుత్ ప్లాంట్ల‌ను తాత్కాలికంగా మూసివేశారు.  ఉద‌యం 6 గంట‌ల నుంచి 10 గంట‌ల వ‌ర‌కు, సాయంత్రం 6 గంట‌ల నుంచి 10 గంట‌ల వ‌ర‌కు విద్యుత్‌ను ఆచితూచి వాడుకోవాల‌ని మ‌హారాష్ట్ర స్టేట్ ఎల‌క్ట్రిసిటీ రెగ్యులేట‌రీ క‌మీష‌న్ పేర్కొన్న‌ది.  బొగ్గుకోర‌త కార‌ణంగా విద్యుత్‌ను యూనిట్ రూ.20 చెల్లించి కొనుగోలు చేస్తున్న‌ట్టు ఎంఎస్ఈఆర్‌సీ ప్ర‌క‌టించింది.  బొగ్గుకొర‌త 3300 మెగావాట్ల విద్యుత్ స‌ర‌ఫ‌రాపై ప‌డిన‌ట్టు ఎంఎస్ఈఆర్సీ తెలియ‌జేసింది.  మ‌రో ప‌ది రోజుల‌పాటు ఇలాంటి ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని, క‌రెంట్‌ను పొదుపుగా వాడుకోవాల‌ని మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌కు విజ్ఞ‌ప్తి చేసింది.  

Read: వ్యాక్సిన్ తీసుకోకుంటే… ఉద్యోగం గోవిందా…

-Advertisement-బొగ్గు కొర‌త ప్ర‌భావం:  13 విద్యుత్ ప్లాంట్లు మూసివేత‌...

Related Articles

Latest Articles