NTV Telugu Site icon

తెలంగాణలో పెరుగుతున్న చలి… మెదక్‌లో అత్యల్ప ఉష్ణోగ్రత

తెలంగాణలో శీతల గాలులు వీస్తుండటంతో చలి క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వచ్చే ఐదు వారాల్లో ఉష్ణోగ్రతలు మరింత తగ్గుతాయని వాతావరణశాఖ శాస్త్రవేత్తలు వెల్లడించారు. సోమవారం నాడు మెదక్‌లో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. మెదక్‌లో 13.8 డిగ్రీలు, ఆదిలాబాద్‌లో 14,8 డిగ్రీలు, హైదరాబాద్‌లో 17 డిగ్రీలు, ఖమ్మంలో 19 డిగ్రీలు, నిజామాబాద్‌లో 17.8 డిగ్రీలు, నల్గొండలో 20 డిగ్రీలు, మహబూబ్‌నగర్‌లో 21 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Read Also: వరల్డ్ రికార్డ్: 7 గంటల్లో 900 మందితో శృంగారం చేసిన మహిళ

మరోవైపు తెలంగాణలో గరిష్ట ఉష్ణోగత్రలు 31 డిగ్రీల నుంచి 33 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. ఈశాన్య దిశల నుంచి తెలంగాణలోకి చల్లటి గాలులు వీస్తున్నాయని.. బుధవారం రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు సూచించారు.