NTV Telugu Site icon

‘మీరే రియ‌ల్ హీరో.. కాదు..మీరే’సోనూసూద్, కేటీఆర్ మధ్య ఆసక్తికర సంభాషణ

మంత్రి కేటీఆర్, బాలీ వుడ్ స్టార్ సోనూ సూద్ ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. కరోనా నేపథ్యంలో ఈ ఇద్దరు ప్రజల సమస్యలను తీరుస్తున్నారు. సోనూ సూద్ అయితే..కరోనా బాధితులు ఏ మూల నుంచి సహాయం కోరినా.. ఇట్టే చేసేస్తున్నాడు. ఇటు కేటీఆర్.. తెలంగాణ ప్రజలకే కాకుండా ఇతర రాష్ట్రాల వారికి అపన్నహస్తంగా ఉంటున్నారు. అయితే తాజాగా ఈ ఇద్దరి మధ్యనే సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర సంభాషణ జరిగింది. మంత్రి కేటీఆర్‌ను ట్విట్ట‌ర్ వేదిక‌గా బాలీవుడ్ న‌టుడు సోనూసూద్ ప్ర‌శంసించారు. కేటీఆరే నిజ‌మైన హీరో అని… కేటీఆర్ నాయ‌క‌త్వంలో తెలంగాణ అభివృద్ధి చెందుతుంద‌ని సోనూసూద్ పేర్కొన్నారు. అయితే.. ఈ ట్వీట్‌పై మంత్రి కేటీఆర్ స్పందించారు. తాను ప్ర‌జ‌ల చేత ఎన్నుకోబ‌డిన నాయ‌కుడిని, త‌న‌కు చేత‌నైనంతా స‌హాయం చేస్తున్నాను. సూప‌ర్ హీరో తాను కాదు. సూప‌ర్ హీరో అని మీరు సోనూసూద్‌ను పిలవ‌చ్చు అని కేటీఆర్ రీట్వీట్ చేశారు. ఇప్పుడు వీరిద్దరి మధ్య సంభాషణ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.