NTV Telugu Site icon

సోము వీర్రాజు లిక్కర్‌ ఆఫర్‌.. ఆ రాష్ట్రాలకేనా అంటూ కేటీఆర్‌ సెటైర్‌..

ఏపీలో నిన్న బీజేపీ జనాగ్రహ సభ నిర్వహించింది. అయితే సభలో పాల్గొన్న ఏపీ బీజేపీ చీఫ్‌ సోము వీర్రాజు మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వం మద్యం ధరలు పెంచిందని.. బీజేపీ అధికారంలోకి వస్తే చీప్‌ లిక్కర్‌ రూ.75 లకే ఇస్తామన్నారు. వీలైతే రూ.50కే చీప్‌ లిక్కర్‌ ఇస్తామంటూ వ్యాఖ్యానించారు. అయితే ఆయన వ్యాఖ్యలపై సర్వత్ర చర్చనీయాంశంగా మారాయి. ఏపీలోని వైసీపీ, టీడీపీ నేతలు సైతం సోము వీర్రాజు మాటలపై మండిపడ్డారు.

ఇదిలా ఉంటే తాజాగా తెలంగాణ ఐటీ శాఖ మంత్రి, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ట్విట్టర్‌ వేదికగా సెటైర్‌లు సంధించారు. నిన్న సోము వీర్రాజు మాట్లాడిన వీడియోను ట్వట్టర్‌లో పోస్టు చేశారు. అంతేకాకుండా ‘వాహ్‌.. ఏం పథకం.. చీప్ లిక్కర్‌ను రూ.50కి సరఫరా చేయాలనే బీజేపీ జాతీయ పథకం బీజేపీ నిరాశలో ఉన్న రాష్ట్రాలకు మాత్రమే ఈ బంపర్ ఆఫర్ ఉందా..?’ అంటూ క్యాప్షన్‌ను కూడా పెట్టారు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్‌గా మారింది.