NTV Telugu Site icon

కొమురంభీం మనవడు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాపై ఏమన్నారంటే..?

దర్శక ధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌. ఈ సినిమాలో మెగాపవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ లు కథానాయకులుగా నటిస్తున్నారు. ఈ మూవీలో మన్యం దొర అల్లూరి సీతారామారాజు పాత్రలో రామ్‌ నటిస్తుండగా.. గొండు బెబ్బులి కొమురం భీం పాత్రలో యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ నటిస్తున్నారు. అయితే ఈ చిత్రం జనవరి 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల ఈ సినిమా నుంచి ట్రైలర్‌ను కూడా చిత్ర యూనిట్ రిలీజ్‌ చేసిందిం.

ప్రస్తుతం చిత్రయూనిట్‌ ఈ సినిమా ప్రమోషన్లో ఉన్నారు. అయితే తాజాగా ఈ సినిమాపై కొమురం భీం మనవడు కొమురం సోనేరావ్‌ స్పందించారు. కొమురం భీం పోరాటానికి సినిమా రూపం ఇవ్వడం సంతోషమని ఆయన అన్నారు. కొమురం భీం చరిత్రను ప్రపంచానికి తెలియస్తున్న రాజమౌళికి సోనేరావ్‌ ధన్యావాదాలు తెలిపారు.